हिन्दी | Epaper

Mexico: ప్రియురాలి కోసం అర్ధరాత్రి వచ్చి హతమైన మాఫియా డాన్

Vanipushpa
Mexico: ప్రియురాలి కోసం అర్ధరాత్రి వచ్చి హతమైన మాఫియా డాన్

ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కింగ్‌పిన్‌గా పేరుగాంచిన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత నెమేసియో ఒసెగ్యురా సెర్వంటెస్ అలియాస్ ఎల్ మెంచో (El Mencho) ఎట్టకేలకు హతమయ్యాడు. ఆదివారం మెక్సికో ప్రత్యేక దళాలు నిర్వహించిన అత్యంత రహస్య ఆపరేషన్‌లో ఎల్ మెంచో తన ఇద్దరు బాడీగార్డులతో సహా ప్రాణాలు కోల్పోయినట్లు మెక్సికో రక్షణ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఆపరేషన్‌లో మొత్తంగా 70 మందికి పైగా మరణించడం అక్కడి భీకర పరిస్థితికి అద్దం పడుతోంది.

Read Also: Bangladesh: దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం

 Mexico: Mafia don killed after coming in the middle of the night to pick up his girlfriend
Mexico: Mafia don killed after coming in the middle of the night to pick up his girlfriend

మెక్సికో దళాలు ఒక వ్యూహాత్మక ప్లాన్

దశాబ్దాలుగా తప్పించుకు తిరుగుతున్న ఎల్ మెంచోను పట్టుకోవడానికి మెక్సికో దళాలు ఒక వ్యూహాత్మక ప్లాన్ వేశాయి. ఎల్ మెంచో ప్రేయసి కదలికలపై నిఘా ఉంచిన అధికారులు.. ఆమెను కలిసేందుకు ఎల్ మెంచో రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా శుక్రవారం రోజు ఆమె జాలిస్కోలోని టపాల్పాలో ఎల్ మెంచోను కలిసేందుకు వెళ్లగా.. అమెరికా ఇంటెలిజెన్స్ సాయంతో అధికారులు వారి ఉనికిని ఖచ్చితంగా గుర్తించారు. ఆ రాత్రి ఆమెతో గడిపిన తర్వాత ఎల్ మెంచో బయటకు వచ్చే లోపు ఆరు హెలికాప్టర్లు, వందలాది మంది సైనికులతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఆపరేషన్ ప్రారంభం కాగానే ఎల్ మెంచో ముఠా అడవిలోని క్యాబిన్ల వెనుక దాక్కోని రాకెట్ లాంచర్లతో సైన్యంపై విరుచుకుపడింది. ఇలా రెండు వర్గాల మధ్య జరిగిన పోరులో ఒక మిలిటరీ హెలికాప్టర్ దెబ్బతిని అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. సైన్యం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టగా.. పొదల మధ్య దాక్కున్న ఎల్ మెంచో, అతని బాడీగార్డులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించినట్లు రక్షణ కార్యదర్శి జనరల్ రికార్డో ట్రెవిల్లా తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చిన్నారి పునర్విక కి పెరుగుతున్న ఆదరణ.. ప్రభుత్వం పై నెటిజన్ల ఒత్తిడి

చిన్నారి పునర్విక కి పెరుగుతున్న ఆదరణ.. ప్రభుత్వం పై నెటిజన్ల ఒత్తిడి

హెరిటేజ్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు

హెరిటేజ్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

కాఫీ ఎక్కువగా తాగుతున్నారా ఐతే ఇది తెలుసుకోండి..

కాఫీ ఎక్కువగా తాగుతున్నారా ఐతే ఇది తెలుసుకోండి..

‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో దేశవ్యాప్త సైబర్ ముఠా అరెస్ట్

‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో దేశవ్యాప్త సైబర్ ముఠా అరెస్ట్

భారీ వర్షాల సూచన.. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్

భారీ వర్షాల సూచన.. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

టీజర్ ఉపసంహరణ: మేకర్స్ కీలక ప్రకటన

టీజర్ ఉపసంహరణ: మేకర్స్ కీలక ప్రకటన

ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు లేదా చెరకు రసం ఏది మంచిది?

ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు లేదా చెరకు రసం ఏది మంచిది?

13 ఏళ్లకే గుండెపోటుతో మరణించిన బాలిక

13 ఏళ్లకే గుండెపోటుతో మరణించిన బాలిక

AI లో నంబర్‌ వన్‌గా డ్రాగన్.. రివర్స్ AI ట్రేడ్ చేస్తున్న భారత్

AI లో నంబర్‌ వన్‌గా డ్రాగన్.. రివర్స్ AI ట్రేడ్ చేస్తున్న భారత్

దేవుడి నైవేద్యానికి కల్తీ నెయ్యి?.. సీఎం ఆగ్రహం

దేవుడి నైవేద్యానికి కల్తీ నెయ్యి?.. సీఎం ఆగ్రహం

📢 For Advertisement Booking: 98481 12870