हिन्दी | Epaper

Telangana Budget 2026-27: మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Saritha
Telangana Budget 2026-27: మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Telangana Budget 2026-27: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో సమావేశాల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 16 నుంచి మార్చి 30వ తేదీ వరకు దాదాపు రెండు వారాల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించింది.

Read also: Railway Parcel Booking: ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!

Telangana Budget 2026-27: మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Telangana Budget 2026-27: Assembly budget sessions from March 16

గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం

సమావేశాల తొలిరోజైన మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగిస్తారు. ప్రభుత్వ లక్ష్యాలు, గత ఏడాది సాధించిన ప్రగతిని ఆయన తన ప్రసంగంలో వివరించనున్నారు. అనంతరం మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుపుతారు. మార్చి 20వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870