Udaipur celebrity wedding : టాలీవుడ్లో క్యూట్ జంటగా పేరుగాంచిన Vijay Deverakonda మరియు Rashmika Mandanna వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత ప్రైవేట్ వాతావరణంలో ఈ వివాహ వేడుక జరగనుందని సమాచారం.
పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులతో కలిసి జంట ఉదయ్‌పూర్ చేరుకుంది. ‘మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్’ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు వేదికగా సిద్ధమైంది. హల్దీ, సంగీత్ కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.
Read also: Gee Geronimo Snail: గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ‘గీ జోరోనిమో’

సుమారు 50 నుంచి 100 మంది అత్యంత సన్నిహితుల మధ్యే ఈ వివాహ వేడుకను నిర్వహించనున్నట్లు సమాచారం. వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం “నో ఫోన్ పాలసీ” అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అతిథుల కోసం ప్రత్యేకంగా జపనీస్ వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో ఆన్‌స్క్రీన్ హిట్ జంటగా నిలిచిన వీరు ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటవుతుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పెళ్లి అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: