West Indies vs Zimbabwe: సూపర్ 8లో భాగంగా జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి ముందు 255 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది.
Read also: IND vs SA: టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్నాం: దక్షిణాఫ్రికా కెప్టెన్
కుప్పకూలిన జింబాబ్వే బ్యాటింగ్‘
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు వెస్టిండీస్ బౌలర్ల ధాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కేవలం 17.4 ఓవర్లలోనే 147 పరుగులకు ఆలౌట్ అయింది. జింబాబ్వే బ్యాటర్లలో ముగ్గురు డకౌట్ కావడం ఆ జట్టు పతనాన్ని శాసించింది. చివర్లో ఇవాన్స్ (43) మెరుపులు మెరిపించినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
West Indies vs Zimbabwe: మెరిసిన విండీస్ బౌలర్లు
వెస్టిండీస్ బౌలర్లలో మోతీ 4 వికెట్లతో జింబాబ్వే నడ్డి విరవగా, హొసీన్ 3 వికెట్లతో రాణించాడు. ఫోర్డె 2 వికెట్లు, హోల్డర్ ఒక వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో వెస్టిండీస్ తన సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: