Tirumala Srivari Teppotsavams 2026: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, సోమవారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్ (Trial Run) నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంజినీరింగ్, విద్యుత్ అధికారులతో కలిసి తెప్పల సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించారు.
Read also: Railway Parcel Booking: ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
5 రోజుల ఉత్సవాల షెడ్యూల్:
ఈ ఏడాది తెప్పోత్సవాలు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
- తొలిరోజు (ఫిబ్రవరి 26): శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి జలవిహారం (3 చుట్లు).
- రెండో రోజు (ఫిబ్రవరి 27): రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి వారి విహారం (3 చుట్లు).
- చివరి మూడు రోజులు (ఫిబ్రవరి 28 – మార్చి 2): శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు.
- 3వ రోజు: 3 చుట్లు.
- 4వ రోజు: 5 చుట్లు.
- 5వ రోజు (చివరి రోజు): 7 చుట్లు.

రద్దయిన ఆర్జిత సేవలు: తెప్పోత్సవాల కారణంగా భక్తుల రద్దీని దృష్ట్యా టీటీడీ పలు సేవలను రద్దు చేసింది:
- ఫిబ్రవరి 26, 27: సహస్రదీపాలంకార సేవ రద్దు.
- ఫిబ్రవరి 28, మార్చి 01, 02: ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలు రద్దు చేయబడ్డాయి.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: