हिन्दी | Epaper

Dates Vs Bananas : త‌క్ష‌ణ శ‌క్తికి ఖ‌ర్జూరాలు లేదా అరటి పండ్లు ఏవి మంచివి?

Sudha
Dates Vs Bananas : త‌క్ష‌ణ శ‌క్తికి ఖ‌ర్జూరాలు లేదా అరటి పండ్లు ఏవి మంచివి?

వ్యాయామం చేయ‌డానికి ముందు, చేసిన త‌రువాత అలాగే కొన్ని సంద‌ర్భాల్లో శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి అవ‌స‌ర‌మ‌వుతుంది. త‌క్ష‌ణ శ‌క్తి అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో చాలా మందికి వెంట‌నే గుర్తుకు వ‌చ్చేవి అర‌టిపండ్లు, ఖ‌ర్జూరాలు.( Dates Vs Bananas) ఇవి స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లో ల‌భించ‌డంతో పాటు తీసుకువెళ్ల‌డం కూడా చాలా సుల‌భం. ఇవి కార్బోహైడ్రేట్ల‌తో నిండి ఉంటాయి. శ‌రీరం శ‌క్తి కోసం వీటిని గ్లూకోజ్ గా మారుస్తాయి. దీంతో మ‌న‌కు త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. అయితే ఖ‌ర్జూరం, అర‌టిపండ్లల్లో త‌క్ష‌ణ శ‌క్తి ఇవ్వ‌డంలో ఏవి బాగా ప‌ని చేస్తాయి. ఖ‌ర్జూరాలు చిన్న‌విగా ఉంటాయి. కానీ చాలా శ‌క్తి వంతంగా ప‌నిచేస్తాయి. గ్లూకోజ్, ఫ్ర‌క్టోజ్ వంటి స‌హ‌జ చ‌క్కెర‌లు వీటిలో అధికంగా ఉంటాయి. ఇవి నీటి శాతాన్ని త‌క్కువ‌గా క‌లిగి ఉంటాయి. క‌నుక పోష‌కాలు కేంద్రీకృత‌మై ఉంటాయి. ఇవి సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. క‌నుక శ‌రీరం వీటిని త్వ‌ర‌గా గ్ర‌హిస్తుంది. ఇక వీటిని వ్యాయామాల‌కు ముందు, దీర్ఘ వ్యాయామాల‌లు లేదా క్రీడ‌ల స‌మ‌యంలో, శ‌రీరానికి త్వ‌ర‌గా శ‌క్తి అవ‌స‌ర‌మైన‌ప్పుడు తీసుకోవ‌చ్చు. ఇవి శ‌రీర బ‌రువును అంత‌గా పెంచ‌వు కానీ శ‌క్తిని అందిస్తాయి క‌నుక అథ్లెట్లు వీటిని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు.

Read Also : Herbal Tea: చామంతి టీతో ఎన్నో లాభాలు

 Dates Vs Bananas
Dates Vs Bananas

అలాగే అర‌టిపండ్ల విష‌యానికి వ‌స్తే ఇవి స‌మ‌తుల్య శ‌క్తిని అందిస్తాయి. ఇవి అందించే శ‌క్తి ఎక్కువ కాలం పాటు ఉంటుంది. అర‌టిపండ్లు సాధార‌ణ, సంక్లిష్ట కార్బొహైడ్రేట్ల మిశ్ర‌మం. వీటిలో నీటి శాతం, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక ఇవి నెమ్మ‌దిగా జీర్ణ‌మవుతాయి. వ్యాయామానికి 30 నుండి 60 నిమిషాల ముందు వీటిని తీసుకోవ‌డం మంచిది. అర‌టిపండ్లు శ‌క్తి స్థాయిల‌ను త్వ‌ర‌గా గ‌రిష్ట స్థాయికి చేరుకోకుండా స్థిరంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఖ‌ర్జూరాలు త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తాయి. అర‌టిపండ్లు మిత‌మైన, స్థిర‌మైన శ‌క్తిని అందిస్తాయి. స‌హ‌జ చ‌క్కెర‌లు ఖ‌ర్జూరాల్లో అధికంగా , అర‌టిపండ్ల‌ల్లో (Dates Vs Bananas)మ‌ధ్య‌స్థంగా ఉంటాయి. ఫైబ‌ర్ కంటెంట్ ఖ‌ర్జూరాల్లో త‌క్కువ‌గా, అర‌టిపండ్ల‌ల్లో ఎక్కువ‌గా ఉంటుంది. ఖ‌ర్జూరాలు చాలా త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. అర‌టిపండ్లు నెమ్మ‌దిగా జీర్ణ‌మ‌వుతాయి. వ్యాయామం చేసే ముందు, వ్యాయామం చేసే స‌మ‌యంలో తీసుకోవ‌డానికి ఖ‌ర్జూరాలు అనువుగా ఉంటాయి. వ్యాయామానికి గంట ముందు తీసుకోవ‌డానికి అర‌టిపండ్లు అనువుగా ఉంటాయి. త‌క్ష‌ణ శ‌క్తి కోసం ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం మంచిది. స్థిర‌మైన, సంపూర్ణ శ‌క్తి కోసం అర‌టిపండ్ల‌ను తీసుకోవ‌డం మంచిది. ఖ‌ర్జూరాలు, అర‌టిపండ్లు శ‌క్తిని అందించ‌డంలో రెండూ ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అయితే వీటిని శ‌రీర శ‌క్తి అవ‌స‌రాల‌ను బ‌ట్టి దేనిని తీసుకోవాలో ఎవ‌రికి వారు నిర్ణ‌యించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870