తెలంగాణా రాష్ట్రంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో 73,74 వ రాజ్యాంగ సవరణలను అనుసరించి నలభై ఆరుశాతం రిజ ర్వేషన్లను సొంతం చేసుకున్న మహి ళలు, నిన్నటికి నిన్న మున్సి పార్టీలకు జరిగిన ఎన్నికలలో ఏభై శాతంతో ఆయా రాజకీయ పార్టీల బి.ఫాం లు అందుకున్నప్పటి నుండి ప్రచార పర్వంలో ప్రజల మధ్యకు వెళ్లేక్రమం లో బి.సి.యస్.సి. యస్.టి సామా జిక వర్గాలనే తేడా లేకుండా, ఆర్థిక మూలాలతో, విద్యా ర్హతలతో సంబంధం లేకుండా మెజారిటీ మహిళలు తమ తమ భర్తల పేరుని మోయాల్సి రావడం మహిళా సాధికా రతను మరుగున పడేసే చర్యగా భావించక తప్పదు. మహిళా సమానత్వానికి తామే ఛాంపియన్లమని ప్రకటిం చుకున్న కొన్ని ప్రసార సాధనాలు సైతం బి.ఫారాలు భర్తల పేరు పైనే వచ్చినట్లు కలర్ ఇస్తూ ప్రచారం చేయడం శోచనీ యమే. అంతే కాకుండా అన్ని రకాల ప్రచార సామగ్రి పైన పోటీలో వున్న భార్యల కన్నా భర్తల ఫోటోలూ, పేర్లేముందు వరసలో ఉండడం మాత్రమే కాకుండా మా ఆవిడను గెలిపి స్తే మీ వార్డు లేదా కార్పొరేట్ డివిజన్ల అభివృద్ధికై నేను నిరంతరం పోరాడుతానని ఎమ్మెల్యేలు, ఎంపిలు మంత్రుల సమక్షంలో ప్రసార సాధనాలలో బహిరంగ ప్రకటనలు చేస్తుండడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా పులులూ, సింహాలుగా తమను తాము చిత్రీకరించుకుంటూ విస్తృత ప్రచారం చేస్తున్న వైనంతో ప్రజాప్రతి నిధులుగా ఎన్నికైన మహిళలు వారి భర్తల చేతుల్లో కీలు బొమ్మలుగా కొనసాగక తప్పదనే భావన సర్వత్ర వెల్లువెత్తుతోంది. ఆకాశం లోసగం, అవనిలో సగం అంటూ ఆధునిక ప్రపంచంలో విద్యా, వైద్య, శాస్త్ర, సాంకేతిక, పోలీస్, మిలట్రీ లాంటి విభిన్న రంగాలతో పాటు, ఐ.ఏ.యస్, ఐ.పి.యస్ ఆఫీసర్లు గా పరిపాలనా రంగంలో, సామాజిక వేత్తలుగా, న్యాయ వాదులుగా, న్యాయ మూర్తులుగా, పాత్రి కేయులుగా సైతం తమ ఉనికిని అత్యంత ప్రభావ పూరితంగా చాటుకుంటున్న మహిళలు రాజకీయ రంగంలో ఎమ్మెల్యేలుగా, యం.పి లుగా ముఖ్య మంత్రులుగా, దేశాధ్యక్షులుగా ఎంతో విజ యవంతంగా తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రం తమ భర్తలు, సోదరులు ఇతర పురుష కుటుంబ సభ్యుల చేతుల్లో మర బొమ్మలుగా మారుతున్న వైనం పురుషులతోపాటు మహిళలకు సమానత్వ (Women Empowerment) హక్కులకు ప్రధాన ప్రతిబంధకంగా భావించక తప్పదు.
Read Also : http://Gold Prices India: బంగారం ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

భర్తల ఆజమాయిషీ
నిజానికి ఎన్నికల ముందే ఏ పదవీ లేకున్నా భార్యలపై భర్తల ఆజమాయిషీ ఇలా కొనసాగుతూ ఉంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల్లో స్త్రీలు పెత్తనం మాత్రం పురుషులదే అవుతుందనే భావన నిజం కాక తప్పదనే గుసగుసలు ఊపందుకుంటున్నాయి. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలతో వారు దైనందిన జీవనంలో ఎదు ర్కొంటున్న సమస్యల పరిష్కారంపట్ల వ్యక్తిగత శ్రద్ధా సక్తులను ప్రదర్శించే చట్టపరమైన బాధ్యతను నెరవేర్చాల్సిన సర్పంచులు, యం.పి.టి.సిలు, జడ్.పి.టి.సిలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మహిళా అభ్యర్థులుగా ఎన్నికలలో విజేతలుగా ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో కనీసం వారిని ఫోన్ ద్వారా నైనా సంప్రదించే అవకాశమే లేకుండా వారి భర్తలే ఆఫీస్ వ్యవహారాలను నడిపిస్తారేమోననే భావన ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో అక్కడక్కడా కొన్నికొన్ని స్థానిక సంస్థల ప్రధాన కార్యాలయాల్లో అధికారంలో వున్న మహిళలకు తోడుగా వారికి కేటాయించిన గదుల్లోనే ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేసుకుని సమాంతర అధికారాన్ని చాలా యిస్తుండడం విస్తుగొలిపేదే. ఈ చర్యలకు కొనసాగింపుగా మహిళలు వార్డ్ మెంబర్లుగా, ఛైర్మన్లుగా ఎన్నికైనప్పటికీ వారి భర్తలే వార్డ్ మెంబర్లుగా, చైర్మన్లుగా వ్యవహరిస్తూ రాజ్యాంగేతర శక్తులుగా మారి పాలనను కొనసాగిస్తున్న వైనం దురదృష కరమే. గతంలో గ్రామ సభల్లో, మండల స్థాయి సమావేశాలలో, కొన్నికొన్ని మున్సిపాలిటీల్లో రాజకీయ నేతల ఒత్తిళ్లతోనో, అధికారుల అలసత్వం లేదా పర్య వేక్షణ లోపం ఫలితంగానో గాని ఆయా అధికారిక సభలూ, సమావేశాల్లో భార్యల తరపున భర్తలే పాల్గొన్న ఉదంతాలు వంద శాతం రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన గా భావించక తప్పదు. నిన్నటికి నిన్న మున్సిపల్ కార్పొ రేషన్ల ఎన్నికల ఫలితాల ప్రకటనల తర్వాత అందులో విజయం సాధించిన మహిళా అభ్యర్థులను అభినందించే క్రమంలో అధికార, విపక్ష శాసన సభ్యులతోపాటు మంత్రు లు తదితర బడాబడా రాజకీయ నాయకులు సైతం అసలు విజేతలైన మహిళలను అలక్ష్యం చేస్తూ వారిభర్తలే గెలిచి నట్లుగా వారినే హీరోలుగా వర్ణిస్తూ అభినందిస్తున్న వైనం మహిళల స్వతంత్రత, సాధికారతకు (Women Empowerment) ఇబ్బందిని కలిగిం చేదేననే సత్యాన్ని జీర్ణించుకోక తప్పదు.

పురుషాధిక్య భావజాలపు ఒత్తిళ్ల ?
నేటికీ మనుస్మృతి ఆధిపత్యం చేస్తున్న భారతీయ సమాజంలో కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషుమాతా, శయనేషు రంభా అనే ఆర్యోక్తిని తిరగ రాస్తూ అత్యున్నత విద్యా సముపార్జనతో ఉద్యోగ ప్రస్తానంలో కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ కార్యాలయాల్లో, కార్ఖానాల్లో ఎదురౌతున్న అనేక అవరోధాలకు, అమానవీయ వేధింపులకు ఎదురొడ్డి అప్రతిహతంగా ముందుకు సాగుతున్న మహిళలు స్థానిక సంస్థల పాలనా వ్యవహారాలను నడిపించలేమనే భావంలోకి నెట్టి వేయబడ డానికి కారణం పురుషాధిక్య భావజాలపు ఒత్తిళ్ల ? లేదా మహిళలకు తమ సామర్థ్యంపై తమకు విశ్వాసం లేని ఆత్మన్యూనత భావమా? అనేది తేల్చు కోవాల్సిన బాధ్యత నిస్సందేహంగా మహిళా లోకానిదేనని చెప్పక తప్పదు. నిజానికి కుటుంబ పరమైన పెళ్లిళ్లూ, పేరంటాలు, గృహ ప్రవేశాలు, నామకరణ మహోత్సవాలూ, తదితర వివిధ శుభ కార్యాల నేపథ్యంలో అచ్చు వేసి పంపిణీ చేసేఆహ్వాన పత్రికలలో భార్యలతో పాటు భర్తల ఫోటోలు సైతం ముద్రించే సాంప్రదాయాన్ని, ఆచారాలను నేటి సమాజం ఆదరిస్తుండడం అభినందనీయమే. ఐతే రాజ్యాంగ నిబంధ నల ప్రకారం జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు మహిళలైనప్పుడు వారికి జారీ చేసే బి.ఫామ్ మినహా వారిఎన్నికల ప్రచార సామగ్రిలో భాగంగా పోస్టర్లు, ప్లెక్సీలు, బ్యానర్లపై భర్తల ఫోటోలే ప్రముఖంగా కనపడు తుండడమే కాదు విజయోత్సవాలలోనూ మహిళలకు తోడు గా కాదు వారే విజ తలుగా ఎన్నికైనట్లు చేస్తున్న ప్రదర్శన లతో కొన్నికొన్ని సందర్భాల్లో వారే చట్టబద్ధంగా ఎన్నికైన భావన కలిగిస్తోంది. ఇదేదీ చాలదన్నట్లు కొన్ని టెలివిజన్ఛా నల్స్ గెలిచిన మహిళా విజేతలను మొక్కుబడిగా అభి నందించి వారి భర్తలతో సుదీర్ఘ ఇంటర్వ్యూలు తీసుకుం టున్న వైనం ఎన్నికైన మహిళా ప్రతినిధులు భర్తల చాటు భార్యలే తప్ప స్వతంత్రంగా ప్రజా ప్రతినిధులుగా తమ తమ రాజ్యాంగ బద్ధమైన విధులను నిర్వహించలేరేమోననే అపోహను కలిగిస్తున్న భావన ప్రజలకు కలగక తప్పదు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే చట్ట బద్ధమైన రిజర్వేషన్ల తో మహిళలకు ఒనగూడాల్సిన రాజకీయ ప్రయోజనాలు ఆచరణలో ప్రశ్నార్థకంగా మారి వారివారి భర్తలూ, కుటుం బంలోని పురుషులే అధికార కేంద్రాలుగా మారి రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన రాజకీయ అధికారాన్ని అనుభవిం చలేని ఉత్సవ విగ్రహాలుగా మహిళలు మిగిలిపోక తప్పదు. ఈ నేపథ్యంలో మహిళలు తమ ఉదాసీనతతో రాజ్యాంగే తర శక్తులుగా రూపాంతరం చెందుతున్న భర్తలతో, సోద రులతో, ఇతర పురుష కుటుంబ సభ్యుల జోక్యంతో తమ అస్థిత్వానికీ, సమానత్వ సాధనకు ఒనగూడుతున్న ప్రమా దాల బారినుండి తమను తాము కాపాడుకుంటూ మేమూ పురుషులతో సమానమేనని నినదిస్తూ గెలిచి నిలుస్తారో లేదా మనుధర్మ స్మృతి మాయలోపడి పురుష ప్రపంచం నీడలోనే నిలిచి తరించే ద్వితీయ శ్రేణిపౌరులుగా తమ జీవి తాలను కొనసాగిస్తారో రాబోయే కాలమే తేల్చిచెప్పాలి.
-డాక్టర్ నీలం సంపత్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: