‘నూటికో కోటికో ఒక్కరు’ అంటూ జపాన్(Japan)లోని ఒసాకా నగరవాసులు ఆ అజ్ఞాత దాతను చూసి మురిసిపోతున్నారు. నగరంలోని నీరు, మురుగు నీటి పారుదల వ్యవస్థ శిథిలావస్థకు చేరడాన్ని చూసి జపాన్లోని ఒకాసా నగరానికి చెందిన ఒక అజ్ఞాత దాత ఏకంగా ఆ శాఖకు సుమారు రూ.33 కోట్ల విలువైన 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
Read Also: India: రంజాన్ మాసంలో అఫ్గాన్ పై పాక్ దాడులు ..మండిపడ్డ భారత్

30 లక్షల జనాభా ఉన్న ఒసాకా జపాన్లోని మూడో అతి పెద్ద నగరం. 1960, 1970 దశకాల్లో ఈ నగరంలో మంచినీరు, మరుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటి జీవిత కాలం 40 ఏండ్లు. అయితే అవి ఏర్పాటు చేసి 60 ఏండ్లు పైగా కావడంతో నగరంలో పలు చోట్ల వ్యవస్థ శిథిలానికి చేరుకుని పైపులైన్ల మరమ్మతులు, లీకేజీలు ప్రారంభమయ్యాయి. ఒక్క 2024లోనే 90కు పైగా లీకేజీల ఫిర్యాదులు అందాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: