Telangana Rain Alert: నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వాతావరణం (IMD) ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని, రైతులు తమ ధాన్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రానున్న 2 గంటల్లో సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండవద్దని హెచ్చరించారు.
Read Also: Government Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు గడువు సమీపం

జోన్ల వారీగా వర్ష సూచన
అలాగే రాత్రి నుంచి ఉదయం వరకు జోన్ 2లో మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి వాతావరణం చూసినట్లయితే.. సాయంత్రం నుంచి రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములతో కూడిన జల్లులు పలు ప్రాంతాల్లో కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నగరవాసులు తమ ప్రయాణాలను ఫ్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
సాధారణంగా మార్చిలో మొదలవ్వాల్సిన ఎండలు ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలోనే మొదలయ్యాయి. ప్రస్తుతం వర్షాల వల్ల వాతావరణం చల్లబడినప్పటికీ, ఇవి ముగిసిన వెంటనే భానుడి భగభగలు మరింత తీవ్రమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: