అఫ్గానిస్థాన్(Afghanistan)పై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా పౌరులు మరణించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనను విడుదుల చేశారు. ‘పవిత్ర రంజాన్ నెలలో మహిళలు, పిల్లలు సహా పౌరుల ప్రాణనష్టం దారితీసిన అప్గాన్ భూభాగంపై పాకిస్థాన్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాలను బయటకు మళ్లించడానికి చేసిన మరో ప్రయత్నం. అఫ్గాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, స్వతంత్రతకు భారత్ మద్దతు ఇస్తూనే ఉంటుంది’ అని రణధీర్ జైస్వాల్ తెలిపారు.
Read Also: Cash withdrawal using Aadhaar: కార్డు లేకపోయినా నగదు విత్‌డ్రా.. ఆధార్ ఉంటే చాలు!

కాబూల్‌లోని పాకిస్థాన్ రాయబారికి సమన్లు జారీ
ఇదిలా ఉండగా, ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్ (IEA) విదేశాంగ మంత్రిత్వ శాఖ కాబూల్‌లోని పాకిస్థాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. నంగర్హార్, పక్తికా ప్రావిన్సులపై పాకిస్తాన్ సైన్యం దాడులు జరిపిందని తెలిపింది. ఈ ఘటనల్లో డజన్ల కొద్దీ పౌరులు మృతిచెందారని అప్గాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో 80 మందికి పైగా మరణించినట్లు ఇస్లామాబాద్ భద్రతా వర్గాలు తెలిపినట్లు స్థానిక మీడియాలు పేర్కొంది. ఇటీవలి ఆత్మాహుతి దాడులకు అఫ్గానిస్థాన్‌లో ఉన్న మిలిటెంట్లను బాధ్యులుగా ఆరోపిస్తూ పాక్ ఈ దాడులు చేపట్టినట్లు తెలిపాయి. నంగర్హార్, పక్తికా, ఖోస్ట్ ప్రావిన్సులలోని ఏడు ప్రాంతాలపై ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. లక్ష్యంగా తీసుకున్న ప్రదేశాల్లో నంగర్హార్లోని న్యూ సెంటర్ నం.1, న్యూ సెంటర్ నం.2, ఖోస్ట్‌లో ఖ్వారిజీ మౌల్వీ అబ్బాస్ సెంటర్, అలాగే పక్తికాలోని కొన్ని మిలిటెంట్ స్థావరాలు ఉన్నట్లు సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: