Rajahmundry Milk Adulteration: రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ పరిధిలో కల్తీ పాలు తాగి స్థానికులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. లాలాచెరువు ప్రాంతంలో జరిగిన ఈ విషాదంలో ఇప్పటికే నలుగురు మరణించినట్లు ఆయన ధృవీకరించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు.
Read Also: P4Scheme: పి-4 పథకంలో లబ్ధిదారుడికి సిఎన్జీ ఆటో పంపిణీ

చికిత్స పొందుతున్న బాధితులకు అండగా ప్రభుత్వం
ప్రస్తుతం ఈ ఘటనలో ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: