हिन्दी | Epaper

Udhayanidhi Stalin: ప్రధానిపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Anusha
Udhayanidhi Stalin: ప్రధానిపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Udhayanidhi Stalin: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార డీఎంకే, బీజేపీ-అన్నాడీఎంకే కూటమి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో, తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కోయంబత్తూరు వేదికగా జరిగిన యువజన విభాగం సమావేశంలో ఆయన విపక్షాలపై విరుచుకుపడ్డారు.

Read Also: Gold Prices India: బంగారం ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘మాకు నరేంద్ర మోదీ అంటే భయం లేదు. మోదీ తండ్రి వచ్చినా సరే మేము భయపడబోము” అని వ్యాఖ్యానించారు. టీవీలో మోదీ కనిపిస్తే ప్రజలు భయపడుతున్నారని, అదే సీఎం స్టాలిన్ కనిపిస్తే కొత్త పథకాలు వస్తాయని సంతోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ‘తమిళనాడు వర్సెస్ ఢిల్లీ’ మధ్య జరుగుతున్న పోరాటమని ఉదయనిధి అభివర్ణించారు.

Udhayanidhi Stalin's controversial comments on the Prime Minister
Udhayanidhi Stalin’s controversial comments on the Prime Minister

బీజేపీ తీవ్ర ఆగ్రహం..

ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ స్థాయిలో విరుచుకుపడింది. డీఎంకే పార్టీకి సంస్కారం, నీతి లేదని ఆ పార్టీ ప్రతినిధి షెజాద్ పూనావాలా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ వెనుకబడిన తరగతి నుంచి వచ్చారు కాబట్టే డీఎంకే, ఇండియా కూటమి నేతలు ఆయన తల్లిదండ్రులను పదేపదే అవమానిస్తున్నారని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870