Thalapathy Vijay: తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన నేపథ్యంలో, ఆయన ఆఖరి చిత్రం ‘జననాయగన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటుడిగా ఆయన ప్రస్థానంలో ఇది చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే, ఈ చిత్రం విడుదలకు ఆది నుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడటం దళపతి ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది.
Read Also: Vijay Deverakonda-Rashmika: ఉదయ్‌పుర్ బయల్దేరిన విజయ్, రష్మిక
సెన్సార్ అభ్యంతరాలు.. న్యాయపరమైన చిక్కులు
ఈ నెలలో జననాయగన్ థియేటర్లలో సందడి చేస్తుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా దీని రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యాయపరమైన చిక్కులు వీడితే విజయ్ పుట్టినరోజు కానుకగా జూన్ లో జననాయగన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

మొదట సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం, సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఆగిపోయింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నా, ప్రస్తుతం సినిమా రివైజింగ్ కమిటీ వద్ద ఉండటంతో ఈ నెలలో కూడా విడుదల సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో మేకర్స్ ఇప్పుడు ఒక ‘స్పెషల్ డే’ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. జూన్ 22న విజయ్ పుట్టినరోజు ఉండటంతో జూన్ 18న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: