हिन्दी | Epaper

Tirumala: తిరుమల లో భక్తురాలిని పాముకాటు వేయలేదు

Saritha
Tirumala: తిరుమల లో భక్తురాలిని పాముకాటు వేయలేదు

అసలు ఏం జరిగింది?

Tirumala: తిరుమల శ్రీవారి దర్శన క్యూలైన్‌లో భక్తురాలికి పాముకాటు వేసిందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం రాత్రి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు. ట్యాక్సీలో మ్యూజియం సమీపంలోని ఆర్.బి.సెంటర్ పార్కింగ్ ఏరియాలో దిగిన సమయంలో, మౌనిక తన పాదాలకు పసుపు రాసుకునేందుకు పక్కనే ఉన్న చీకటి ప్రదేశంలోకి వెళ్లారు. ఆ సమయంలో కాలుపై ఏదో స్పర్శ తగలడంతో ఆమె భయపడ్డారు. భర్త శరత్ అక్కడ పరిశీలించగా ఒక చిన్న పాము కనిపించింది అన్నారు.

Read Also: Tirumala Darshan Update: తిరుమలలో భారీగా కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: తిరుమల లో భక్తురాలిని పాముకాటు వేయలేదు
Tirumala: No snakebite to a devotee in Tirumala

వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించే ఎలాంటి పాము కాటు లేదని నిర్ధారించారు. అయినప్పటికీ మహిళా భక్తురాలి ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. అక్కడ కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారు. ఆ పాము కూడా విషపూరితం కాదని విచారణలో తేలింది. సదరు భక్తులు టీటీడీ సిబ్బంది సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఉదయం వారు క్షేమంగా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

తిరుమల అటవీ ప్రాంతంతో కూడిన పుణ్యక్షేత్రం కావడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ కోరింది. భక్తులు తమ భద్రత దృష్ట్యా నిర్దేశించిన ప్రాంతాల నుండి మాత్రమే క్యూలైన్లలోకి వెళ్లాలని, నిషేధిత అటవీ ప్రాంతాల్లో లేదా చీకటి ప్రదేశాల్లో సంచరించకూడదని విజ్ఞప్తి చేసింది. నేడు ఉదయం మౌనిక దంపతులు క్షేమంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870