మెక్సికో మోస్ట్ వాంటెండ్ డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచో మిలిటరీ ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఈ మేరకు అధికార వర్గాలు ఓ ప్రకటన చేశాయి. ఎల్ మెంచో మృతి తర్వాత మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది. అతడి అనుచరులు పలు ప్రాంతాల్లో వాహనాలను తగులబెట్టారు. రహదారులను దిగ్బంధించారు. ఈ అల్లర్ల నేపథ్యంలో భారత పౌరులకు ప్రభుత్వం ఒక అడ్వైజరీ జారీ చేసింది. మెక్సికోలోని భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎల్ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికో(Mexico) సైన్యం భారీ ఆపరేషన్ను చేపట్టింది. ఆదివారం జాలిస్కోలోని తప్పాల పట్టణంలో ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఎల్ మెంచో ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే మెంచో అనుచరులు కాల్పులకు జరపగా, సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ఎల్ మెంచో సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని విమానంలో మెక్సికో నగరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
Read Also: Sangareddy Road Accident: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కంటైనర్!

మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలు
ఎల్ మెంచో మృతితో మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. మాఫియా డాన్ అనుచరులు పలు ప్రాంతాల్లో వాహనాలను తగలబెట్టారు. రహదారులను దిగ్బంధించారు. సూపర్ మార్కెట్లు, బ్యాంకులను నిప్పంటించారు. అంతేకాకుండా అధికారులతో ఘర్షణలకు దిగినట్లు జాలిస్కో గవర్నర్ పాబ్లో లెమస్ నవారో తెలిపారు. ప్రజా రవాణా సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. ఈ హింస కనీసం ఐదు రాష్ట్రాలకు వ్యాపించినట్లు తెలిపారు. ముఖ్యంగా 2026 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్న జాలిస్కో రాష్ట్రంలో భద్రతా ఆందోళనలు పెరిగాయి. మెక్సికోలో పరిస్థితులు ఉద్రిక్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు రాయబారి కార్యాలయం సూచనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. భారతీయ పౌరులకు ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. ‘మెక్సిలోని జాలిస్కో, తమౌలిపాస్, మిచోఆకాన్, గ్యురెరో, న్యూవో లియోన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో హింస్మాతక ఘటనలు జరగుతున్నాయి. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు ఇళ్లలోనే ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: