Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 22న (ఆదివారం) చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఈ వేసవి కానుకగా మే 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Read Also: TPCC Chief: మహేష్ గౌడ్‌కు విజయ్-రష్మిక పెళ్లి ఆహ్వానం
సంచలన వ్యాఖ్యలు
సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అభిమానులతో ముచ్చటించిన సమంత, తన వ్యక్తిగత జీవితంపై వచ్చే విమర్శలపై ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత విషయాల్లోకి పనిగట్టుకుని నెగెటివిటీని తీసుకువచ్చే వారిని ఏమాత్రం ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. అలాంటి వారిని వెంటనే ‘బ్లాక్ లిస్టు’లో పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా బ్లాక్ చేశానంటే వారు తనను బాధపెట్టినట్లు కాదని, తన ప్రపంచంలోకి వారికి ప్రవేశం లేదని అర్థమని అన్నారు.సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించే ట్రోలర్లకు ఇది ఒక గట్టి హెచ్చరికగా భావించవచ్చు.

సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై వచ్చే నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్‌ను ఎలా ఎదుర్కొంటారని అడిగిన ప్రశ్నకు సమంత స్పందిస్తూ, ప్రశంసలు తనను పొంగిపోయేలా చేయవని, అలాగే విమర్శలు తనను కుంగదీయలేవని స్పష్టం చేశారు. తన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో, తన సోషల్ మీడియా పేజీని కూడా అలాగే ఉంచుకోవాలని భావిస్తానని ఆమె పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: