हिन्दी | Epaper

GATE 2026: ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు మార్చి 19న

Pooja
GATE 2026: ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు మార్చి 19న

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొవిజినల్ ఆన్సర్ కీని ఐఐటీ గువాహటి విడుదల చేసింది. ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపర్లు కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Read Also:APInterExams: ఓపెన్ స్కూల్ ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల

GATE 2026
GATE 2026: Provisional answer key released.. Results to be declared on March 19

అభ్యర్థులు తమ ఎన్రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఆన్సర్ కీ, ప్రశ్నాపత్రం, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేట్ ఆన్‌లైన్ పరీక్షలు ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించగా, మొత్తం 30 టెస్ట్ పేపర్లకు పరీక్షలు జరిగాయి. ప్రొవిజినల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలను అభ్యర్థుల నుంచి స్వీకరించి నిపుణుల ద్వారా పరిశీలిస్తారు. అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి ఫలితాలను ప్రకటిస్తారు. GATE 2026 ఫలితాలను మార్చి 19న విడుదల చేయనున్నట్లు ఐఐటీ గువాహటి వెల్లడించింది.

GATE పరీక్ష దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, టెక్నాలజీ, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ వంటి విభాగాల్లో నిర్వహించే ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పరీక్ష. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఐఐటీలు సహా ప్రముఖ విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తాయి. ఇదే సమయంలో తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (TOSS) పరిధిలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఉదయం, సాయంత్రం సెషన్లలో పరీక్షలు జరగనున్నాయని, ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కల్తీ పాల ఘటనపై స్పందించిన వైఎస్ షర్మిల

కల్తీ పాల ఘటనపై స్పందించిన వైఎస్ షర్మిల

గుమ్మడి గింజలు తింటే సంతాన సమస్యలకు చెక్!

గుమ్మడి గింజలు తింటే సంతాన సమస్యలకు చెక్!

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

అమిత్ షా చేతుల మీదుగా భారత్ టాక్సీ లాంచ్

అమిత్ షా చేతుల మీదుగా భారత్ టాక్సీ లాంచ్

వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు

వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు

కల్తీ పాల ఘటనపై మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన

కల్తీ పాల ఘటనపై మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

స్టాలిన్‌ పాలనపై విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు

స్టాలిన్‌ పాలనపై విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు

ఈ నెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు

ఈ నెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు

కల్తీ పాల మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

కల్తీ పాల మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీఆర్‌ఎస్‌ డిమాండ్

చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీఆర్‌ఎస్‌ డిమాండ్

జోగులాంబ గద్వాల నుంచే కొత్త పార్టీ ప్రారంభం

జోగులాంబ గద్వాల నుంచే కొత్త పార్టీ ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870