Nani-Triptii Dimri: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ అనే హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కోసం నాని తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. గత చిత్రాలకు భిన్నంగా ఇందులో ఆయన ఒక రఫ్ అండ్ టఫ్ ఊర మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. నాని కెరీర్‌లోనే ఇది ఒక భారీ యాక్షన్ విజువల్ ట్రీట్ కానుందని సినీ వర్గాల సమాచారం.
Read Also: Maa Inti Bangaram Release: ‘మా ఇంటి బంగారం’ విడుదల తేదీ ఫిక్స్
సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’: స్టైలిష్ యాక్షన్ డ్రామా
‘ఓజీ’ చిత్రంతో మాస్ ఎలివేషన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో నాని ఒక స్టైలిష్ యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సుజీత్ మార్క్ స్టైలిష్ టేకింగ్, నాని నటన తోడైతే ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కాంబినేషన్ ప్రకటించగానే అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా బాలీవుడ్ సెన్సేషన్ తృప్తి డిమ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్‌లో నటిస్తోంది.. ‘యానిమల్ ’ చిత్రంతో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి, నాని సరసన నటిస్తే ఆ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ రావడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: