APInter hallticket: రాష్ట్ర సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్లను విడుదల చేసింది. విద్యార్థులు తమ జిల్లా, పాఠశాల, విద్యార్థి పేరు వంటి వివరాలను అధికారిక వెబ్సైట్లో నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read Also:AP Inter Exams 2026: ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: లోకేష్

వాట్సప్ ద్వారా కూడా డౌన్లోడ్ అవకాశం
అలాగే వనమిత్ర వాట్సప్ సేవల ద్వారా కూడా హాల్‌టికెట్లు పొందవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి, “Education Services”లోకి వెళ్లి “IPE 2026 Hall Ticket” ఎంపికను ఎంచుకోవాలి. అవసరమైన వివరాలు నమోదు చేసిన వెంటనే హాల్‌టికెట్ వాట్సప్‌కు నేరుగా వస్తుంది. ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు మార్చి 2 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇదే సమయంలో రెగ్యులర్ ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ మరియు ఓపెన్ స్కూల్ విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌తో పాటు వనమిత్ర వాట్సప్ సేవల్లో అందుబాటులో ఉంచారు.
ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్ష బుక్‌లెట్‌లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఇచ్చే 24 పేజీల బుక్‌లెట్‌కు బదులుగా 32 పేజీల బుక్లెట్ అందజేస్తారు. అదనపు సమాధాన షీట్లు ఇవ్వరు, విద్యార్థులు సమాధానాలను పూర్తిగా అదే బుక్‌లెట్‌లో రాయాలి. ప్రశ్నపత్రాల విధానం, సిలబస్‌లో మార్పుల కారణంగా పేజీల సంఖ్యను పెంచారు. కాగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు గత ఏడాది మాదిరిగానే 24 పేజీల బుక్‌లెట్‌ను అందజేయనున్నారు. ఈ మార్పులను విద్యార్థులు గమనించాలని ఇంటర్ బోర్డు సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: