हिन्दी | Epaper

Sangareddy Road Accident: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కంటైనర్!

Tejaswini Y
Sangareddy Road Accident: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కంటైనర్!

Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున ఒక భీకర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం, నిద్రమత్తు కారణంగా జరిగిన ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: US Education Report: అమెరికాలో హిందువులు, యూదులు విద్యలో టాప్

Sangareddy Road Accident: Container hits water tanker!
Sangareddy Road Accident: Container hits water tanker!

అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ నుండి పిట్లం వైపు వేగంగా వెళ్తున్న ఒక కంటైనర్ లారీ, శివ్వంపేట బీర్ ఫ్యాక్టరీ సమీపంలోకి రాగానే అదుపుతప్పింది. అదే సమయంలో హైవే మధ్యలో ఉన్న చెట్లకు నీళ్లు పడుతున్న వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. కంటైనర్ అతివేగంతో ఉండటంతో ఢీకొన్న ధాటికి లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.

డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరం

ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ మహమ్మద్ మజిల్ (25) క్యాబిన్ లోపల ఇరుక్కుపోయారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అతికష్టం మీద డ్రైవర్‌ను బయటకు తీశారు. డ్రైవర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండగా, క్లీనర్ మహమ్మద్ తగ్దీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870