हिन्दी | Epaper

Brahmin Marriage Meet Tirupati: బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన

Siva Prasad
Brahmin Marriage Meet Tirupati: బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన

Brahmin Marriage Meet Tirupati: తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఉద్దండ గణపతి వేద పాఠశాల వేదికగా దక్షిణ భారతీయ బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక మరియు సామూహిక షష్టిపూర్తి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్. నరసింహాచార్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ నేతృత్వంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించబడింది.

Read Also:Ram Mohan Naidu: పూతలపట్టులో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

వివాహ పరిచయ వేదికకు 800 మంది హాజరు

షష్టిపూర్తి అనంతరం నిర్వహించిన నూతన వధూవరుల వివాహ పరిచయ వేదికకు రాష్ట్ర నలుమూలల నుండి దాదాపు 800 మంది తల్లిదండ్రులు, వధూవరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వేదిక్ యూనివర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి, నేషనల్ సంస్క్రిట్ యూనివర్సిటీ వీసీ జి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి, తాసిల్దార్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Brahmin Marriage Meet Tirupat
Brahmin Marriage Meet Tirupati: Brahmin marriage introduction platform receives exceptional response

బ్రాహ్మణ ఐక్యతకు పిలుపు

ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. బ్రాహ్మణులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు జిల్లా అధ్యక్షులు నరసింహాచారి చేస్తున్న కృషిని అభినందించారు. రాష్ట్ర క్రమశిక్షణ మండలి అధ్యక్షులు కొత్తపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ హైందవ ధర్మాన్ని చాటాలని కోరారు. వివాహాల కోసం సరైన వేదికలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.

సేవలకు సత్కారం

]ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గత మూడు నెలలుగా కృషి చేసిన కన్వీనర్లను, అలాగే వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన మ్యారేజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకులను వేదం హరిప్రసాద్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నాయకులు, రాష్ట్ర ప్రతినిధులు ముకుందాపురం మహేష్, సింగరాజు నాగార్జున, డాక్టర్ చక్రపాణి, మహిళా అధ్యక్షురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870