IND vs SA: టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో ఆదివారం జరిగిన కీలక పోరులో భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన సౌతాఫ్రికా జట్టు 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నీలో సెమీ ఫైనల్ ఆశలు బలపరుచుకోవాలనుకున్న టీమ్ ఇండియాకు ఈ ఓటమి భారీ దెబ్బగా మారింది.
Read Also: T20 WC 2026: సూపర్-8 మ్యాచ్..టాస్ గెలిచిన శ్రీలంక
188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, సఫారీ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్‌కు ఈ టోర్నీలో ఇదే మొదటి ఓటమి. 188 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (0) పరుగులేమీ చేయకుండానే మార్క్రామ్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది.ఆ వెంటనే తిలక్ వర్మ (1) కూడా మార్కో జాన్సెన్ వేసిన మొదటి బంతికే అవుట్ కావడంతో భారత్ 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

కాసేపు మెరుపులు మెరిపించిన అభిషేక్ శర్మ (15) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 31 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత భారత్ బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు.111 పరుగులకే టీమ్‌ఇండియా ఆల్ అవుట్ అయింది. 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది.శివమ్ దూబె (42) భారత బ్యాటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: