Harvard ai policy symposium : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించేందుకు ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం మార్చి 27న అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో జరగనుంది. ఈ సదస్సుకు భారత్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం విశేషంగా నిలిచింది.
“AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce” అనే అంశంపై జరిగే ప్యానెల్ చర్చలో సీఎం పాల్గొని కృత్రిమ మేధ వల్ల జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు, నగర జీవనశైలి ఎలా మారుతున్నాయనే అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ముఖ్యంగా డేటా సెంటర్లు, శక్తి వనరులు, కంప్యూట్ కారిడార్ల ప్రాధాన్యం వంటి అంశాలపై చర్చ జరగనుంది.
Read Also: UP Crime News: భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను హార్వర్డ్ నిర్వాహకులు ప్రశంసించారు. రాష్ట్రంలో ఏఐ సిటీ ఏర్పాటుతో పాటు, భూమి, విద్యుత్, డిజిటల్ మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వివరించాలని ఆయనను కోరారు. ఇటీవల హార్వర్డ్‌లో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసిన సందర్భంగా నిర్వాహకులు స్వయంగా కలిసి ఈ ఆహ్వానం అందజేశారు.
ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థల సమన్వయం ద్వారా ఏఐ రంగంలో ఎలా పురోగతి సాధించవచ్చో ఈ వేదిక ప్రపంచానికి చూపనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: