हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Ap council controversy : బొత్స రాజీనామా చేస్తారా? మండలిలో ఘటనపై ఉద్రిక్తత

Sai Kiran
Ap council controversy : బొత్స రాజీనామా చేస్తారా? మండలిలో ఘటనపై ఉద్రిక్తత

Ap council controversy : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు, ఆ పార్టీ ఎమ్మెల్సీలకు రాజీనామా చేసే దమ్ముందా అని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ విజయనగరం అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, ఎమ్మెల్యే లోకం మాధవి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, బీజేపి జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ ప్రశ్నించారు. హిందుత్వమన్నా.. హిందువుల మనోభావాలన్నా వైసీపీకి ఏ మాత్రం గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ ల తీరుపై కూటమి ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు.

ఈ మేరకు శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్సీ ల ప్రవర్తనను దుయ్యబట్టారు. తిరుపతి లడ్డూ నాణ్యత తగ్గడం, దేవాలయాలపై దాడులు జరగడం, టీటీడీ చైర్మన్ల వివాదాస్పద వ్యాఖ్యలు, కౌన్సిల్లో దేవుడికి కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా ఉన్నాయని అన్నారు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా తిరుపతిని, వెంకన్న స్వామిని వారు ఎప్పుడూ చిన్నచూపు చూసేవారని విమర్శించారు. స్వామి వారి లడ్డూ ప్రసాదం టీడీపీ హయాంలో ఎంత నాణ్యతగా ఉండేదో, వైసీపీ ఉన్నప్పుడు ఎలా ఉందో శ్రీవారి భక్తుల్లో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో లడ్డూ నాణ్యత విషయంలో ప్రతి భక్తుడూ ఆందోళన చెందాడని కూటమి ప్రతినిధులు ఈ సందర్బంగా గుర్తు చేశారు.

Read Also: Manik Gupta: తేనెటీగల దాడిలో అంపైర్ మృతి

Ap council controversy
Ap council controversy

రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సును తీసేశారని.. ఆ సమయంలో వారు ఎటువంటి ప్రకటనలిచ్చారో అందరికీ తెలుసన్నారు. తిరుపతి లడ్డూను ఎవరిచ్చినా.. దేవుడి క్యాలెండరును అందించినా.. చెప్పులు తీసేసి మరీ అందుకుంటామని, కుర్చీలో కూర్చొన్నామంటే, లేచి నిల్చొని ఆ ప్రసాదం తీసుకుంటామన్నారు. అలాంటిది ‘కౌన్సిల్‌లో వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లతో స్వామి వారి చిత్రపటాన్ని పట్టుకుని దేవుడిని రాజకీయం చేశారని ఆక్షేపించారు. అబద్ధాలను నిజం చేయడంలో బొత్స దిట్ట అని విమర్శించారు.

కొత్త వాళ్లెవరైనా ఆయన మాటలు వింటే.. నిజమనుకుంటారని, అంత కన్విన్స్ చేసేలాగా బొత్స మాట్లాడతారని అపహాస్యం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు కౌన్సిల్‌లో చేసిన రాద్ధాంతం ఏమిటనేది ఫొటోలు, వీడియోలతో సహా చూపించామని దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్సీ లంతా రాజీనామా చెయ్యగలరా అని సవాల్ చేశారు. పవిత్ర వేదికలను కౌరవ సభగా మార్చేస్తున్నారని ఆరోపించారు.

మండలిలో బొత్స మాట్లాడినవన్నీ అబద్ధాలేనని స్పష్టం చేశారు. వైసీపీ నేతల పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు. నిజానికి బొత్స సరిగ్గా మాట్లాడలేరని అపహాస్యం చేశారు. తిరుపతి వెళ్ళినప్పుడు జగన్ ఎప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చారా అని, అబ్దుల్ కలాం కంటే ఆయన గొప్పవాడా అని అని ప్రశ్నించారు. దేవదేవుడు శ్రీనివాసుడిని కూడా రాజకీయాల్లోకి వాడుకునే నీచస్థాయికి వైసీపీ నేతలు దిగజారారని విమర్శించారు. కూటమి నాయకులు ప్రసాదుల ప్రసాద్, గంటా రవి తదితరులు కూడా పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870