Suryakumar yadav captain : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భాగంగా దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతున్న టీమిండియా శిబిరంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే అతని పేలవ ప్రదర్శనపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. అభిషేక్ త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని జట్టు యాజమాన్యం విశ్వాసంతో ఉందని తెలిపాడు.
మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్, అభిషేక్‌పై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నాడు. “అతను ఇంకా పరుగులు చేయలేదని ఆందోళన చెందుతున్నవాళ్లను చూసి నేనే ఆశ్చర్యపోతున్నాను. ఒకసారి అతను పరుగులు చేయడం ప్రారంభిస్తే ప్రత్యర్థి జట్లకు కష్టాలు మొదలవుతాయి” అని వ్యాఖ్యానించాడు. గత ఏడాది కాలంగా జట్టుకు అతను కీలక పాత్ర పోషించాడని, ఇప్పుడు అతనికి అండగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నాడు. “ఇది జట్టు ఆట. ఒకరు విఫలమైతే మిగతావాళ్లు భర్తీ చేస్తారు” అని అన్నాడు.
Read Also: Manik Gupta: తేనెటీగల దాడిలో అంపైర్ మృతి

ఈ టోర్నమెంట్‌లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు పెద్దగా రాణించలేకపోయాడు. అమెరికాపై గోల్డెన్ డక్‌గా అవుట్ కాగా, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లలో కూడా తొందరగా వికెట్ కోల్పోయాడు. అయినప్పటికీ జట్టు అతనిపై నమ్మకం కోల్పోలేదని స్పష్టం చేసింది.
భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా అభిషేక్‌కు మద్దతు ప్రకటించాడు. అతను ప్రపంచ స్థాయి ఆటగాడని, జట్టులో అతని స్థానంపై ఎలాంటి సందేహం లేదని తెలిపాడు. నెట్స్‌లో బాగా ఆడుతున్నాడని, త్వరలోనే కీలక ఇన్నింగ్స్ ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాపై అభిషేక్‌కు మంచి రికార్డు ఉండటం కూడా జట్టుకు ధైర్యాన్నిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: