IndirammaScheme: తెలంగాణ ప్రభుత్వం గృహ నిర్మాణ లబ్ధిదారులకు కీలక ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. అయితే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ హౌసింగ్ పథకాన్ని ప్రారంభించడంతో, గృహలక్ష్మి కింద ప్రారంభమైన అనేక ఇళ్లు మధ్యలోనే నిలిచిపోయాయి.
Read Also:Gadwal Fire Accident: గద్వాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం

ఈ పరిస్థితిలో, గృహలక్ష్మి లబ్ధిదారులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. గృహలక్ష్మి పథకం కింద ప్రారంభమై ఆర్థిక సమస్యలతో ఆగిపోయిన ఇళ్లను ఇందిరమ్మ పథకం పరిధిలోకి తీసుకువచ్చి నిధులు అందించాలని నిర్ణయించింది. దీంతో సంవత్సరాలుగా పూర్తి కాకుండా ఉన్న పునాదులు, పిల్లర్లు ఉన్న ఇళ్లు ఇకపై నివాసయోగ్యమైన గృహాలుగా మారే అవకాశం ఉంది.
ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. నిలిచిపోయిన గృహ నిర్మాణాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను ఇందిరమ్మ పథకానికి ఎంపిక చేస్తారు. ఇందిరమ్మ మార్గదర్శకాల ప్రకారం ఇంటి పునాది విస్తీర్ణం 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్య ఉండాలి. గృహలక్ష్మి ఇళ్ల పునాది విస్తీర్ణం తక్కువగా ఉంటే అవసరమైన అదనపు పునాది బీమ్‌లు వేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే పునాది దశ పూర్తయిన నిర్మాణాలకు ఆ దశ నిధులు ఇవ్వరు.
మిగిలిన రూ.4 లక్షల సహాయాన్ని దశల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. పైకప్పు లెవల్‌కు చేరితే రూ.1 లక్ష, స్లాబ్ పూర్తయిన తర్వాత రూ.2 లక్షలు, మొత్తం నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ.1 లక్ష చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: