స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ నెల థీమ్‌గా జీరో లిటర్ గవర్నెన్స్
Tirupati: తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లిలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో ఈ నెల ప్రత్యేక థీమ్‌గా “జీరో లిటర్ గవర్నెన్స్” పై అవగాహన కార్యక్రమం శనివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గొని గ్రామస్తులకు తడి–పొడి చెత్త వేర్వేరు సేకరణ, రీసైక్లింగ్ సర్క్యులర్ ఎకానమీ ప్రాముఖ్యతపై వివరించారు.
Read Also: AU Students Protest: ఆంధ్ర యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu) నాయుడు సంకల్పంతో ప్రతి నెల మూడో శనివారం “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” కార్యక్రమం ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం జనవరి నుంచి నిరంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఈ నెల కార్యక్రమంలో ఈ నెల థీమ్‌గా “జీరో లిటర్ గవర్నెన్స్” అమలవుతోందన్నారు.
జీరో లిటర్ గవర్నెన్స్ అంటే ఎటువంటి చెత్త బయట పడవేయకుండా, ఇంటి వద్దే తడి చెత్త–పొడి చెత్త వేరు చేసి శాస్త్రీయంగా నిర్వహించడం అని తెలిపారు. తడి చెత్తను ఎరువుగా మార్చి కూరగాయల సాగుకు వినియోగించుకోవచ్చని, పొడి చెత్తను రీసైక్లింగ్ ద్వారా మళ్లీ వినియోగ వస్తువులుగా తయారు చేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథం ద్వారా చెత్త సేకరణ విధానాన్ని ప్రదర్శించారు. ఇద్దరు విద్యార్థులు సుమారు 11 కిలోల పాత నోటుబుక్స్, పేపర్లు అందజేసి, వాటి విలువగా వచ్చిన డబ్బుతో కొత్త నోటుబుక్స్, స్టేషనరీ కొనుగోలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విధానం ద్వారా చెత్త తగ్గడమే కాకుండా విద్యార్థులకు, సేకరణదారులకు ఆదాయం కలుగుతుందని తెలిపారు.
ఆరోగ్యంపై అవగాహన
Tirupati పరిశుభ్రమైన వాతావరణం మన ఆరోగ్యానికి, మన కుటుంబ భవిష్యత్తుకు ఎంతో అవసరమన్నారు. దోమలు, ఈగలు, కీటకాలు ఎక్కువగా చెత్త కుప్పల్లో, నిల్వ నీటిలో, డ్రైనేజ్ నీళ్లలో పెరుగుతాయి. వాటి వల్ల డెంగ్యూ, మలేరియా వంటి అనేక వ్యాధులు వస్తాయి. కాబట్టి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఇటీవల వార్తల్లో చూస్తున్నట్లు డిల్లీ లో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. అక్కడి ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. మనం అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలన్నారు. మన గ్రామం, మన పట్టణం, మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి అంటే అది మన ఇళ్ల నుంచే ప్రారంభంకావాలన్నారు. ఇప్పుడు “వేస్ట్ టు ఎనర్జీ” అనే విధానం ద్వారా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. “చెత్తలోనే సంపద ఉంది” అనే భావనను మన గౌరవ ముఖ్యమంత్రి గారు తరచుగా చెబుతున్నారు. చెత్తను వేరు చేసి సేకరించడం ద్వారా రీసైక్లింగ్ చేయవచ్చు, ఎరువులు తయారు చేయవచ్చు, విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఇలా చెత్తనే ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు.
స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ తీసుకుని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి అందరూ సహకరించాలి
ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మనందరం కలిసి పని చేయాలని ప్రతి ఇంటిలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం మొదలుపెట్టాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, నిర్దేశిత ప్రదేశాల్లో వేయాలన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మనమందరం “స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ” తీసుకుందామని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని, చెత్తను సక్రమంగా వేరు చేసి అందిస్తామని, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తామని మాట ఇవ్వాలి. ఈ ప్రతిజ్ఞను మన పిల్లలకు, పెద్దలకు, అందరికీ తెలియజేసి పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మన వంతు సహకారం అందిద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ, సర్పంచ్ జోగి మోహన్ , ఆర్డిఓ రామ్మోహన్, జిల్లా పంచాయతీ అధికారి సుశీల దేవి, డి ఆర్డీఏ పి డిశోభన్ బాబు, కార్పొరేషన్ డైరెక్టర్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: