हिन्दी | Epaper

Gas tanker explosion: శాంటియాగోలో ట్రక్కు బోల్తా పడి భారీ పేలుడు

Saritha
Gas tanker explosion: శాంటియాగోలో ట్రక్కు బోల్తా పడి భారీ పేలుడు

Gas tanker explosion: చిలీ రాజధాని శాంటియాగోలో గురువారం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ద్రవ రూపంలో ఉన్న గ్యాస్‌ను (LPG) తరలిస్తున్న ఓ భారీ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తా పడి పేలిపోవడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

స్థానిక గ్యాస్ సంస్థ ‘గాస్కో’కు చెందిన ఈ ట్రక్కు ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. క్రాష్ అయిన నిమిషాల వ్యవధిలోనే ట్రక్కులోని గ్యాస్ ట్యాంకర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ధాటికి ట్రక్కు డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది.

Read Also: Medak Municipal : మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం

Gas tanker explosion: Truck overturns in Santiago, causing massive explosion

నిమిషాల్లోనే అగ్నిగోళంగా మారిన ట్రక్కు

పేలుడు తీవ్రతకు 150 నుంచి 200 మీటర్ల పరిధిలోని 50 వాహనాలు దెబ్బతిన్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఎగిసిపడిన శకలాలు మూడు వ్యాపార సంస్థల ప్రాంగణాల్లో పడ్డాయని చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ తెలిపారు. శాంటియాగో గవర్నర్ క్లాడియో ఒరెగో సమాచారం ప్రకారం.. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. “ఒక వ్యక్తి శరీరం 100 శాతం కాలిపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు” అని గవర్నర్ పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్డుపై మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్న దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శాంటియాగోలో ట్రక్కు బోల్తా పడి భారీ పేలుడు

శాంటియాగోలో ట్రక్కు బోల్తా పడి భారీ పేలుడు

కుప్పకూలిన డాలర్.. పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

కుప్పకూలిన డాలర్.. పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

సొంత వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? గ్యారెంటీ లేకుండానే రూ. 20 లక్షల వరకు లోన్!

సొంత వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? గ్యారెంటీ లేకుండానే రూ. 20 లక్షల వరకు లోన్!

యష్ టాక్సిక్ టీజర్ విడుదల
1:52

యష్ టాక్సిక్ టీజర్ విడుదల

భార్యను హత్య చేసిన ఇస్రో రిటైర్డ్ అధికారి నాగేశ్వర్ రావు?

భార్యను హత్య చేసిన ఇస్రో రిటైర్డ్ అధికారి నాగేశ్వర్ రావు?

నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం

నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం

కొరుటూరులో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

కొరుటూరులో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

బాలీవుడ్‌ పై నటి రెజీనా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ పై నటి రెజీనా సంచలన వ్యాఖ్యలు

ఒకప్పుడు హైదరాబాద్ అంటే బిర్యానీ గుర్తుకొచ్చేది

ఒకప్పుడు హైదరాబాద్ అంటే బిర్యానీ గుర్తుకొచ్చేది

టీచర్లకు ఎఐ ప్రత్యామ్నాయంగా మారుతుందా?

టీచర్లకు ఎఐ ప్రత్యామ్నాయంగా మారుతుందా?

No image

పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870