PG Medical Course Guidelines: దేశంలోని మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) శుభవార్త వినిపించింది. పీజీ కోర్సుల ప్రారంభం, నిర్వహణకు సంబంధించి నిబంధనలను సరళీకరిస్తూ ఒక కీలక ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం, ఇప్పటికే నడుస్తున్న మెడికల్ కాలేజీల్లో కొత్తగా పీజీ కోర్సులు (MD/MS) ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ (EC) తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల విద్యా సంస్థలపై పరిపాలనాపరమైన భారం తగ్గనుంది.
Read Also: West Bengal Crime: విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు
కొత్త కాలేజీలకు మాత్రమే ఈసీ నిబంధన.. కార్పస్ ఫండ్ తప్పనిసరి
ఎన్‌ఎంసీ తన ముసాయిదాలో కొన్ని కీలక మార్పులను ప్రతిపాదించింది. కేవలం కొత్తగా స్థాపించబోయే మెడికల్ కాలేజీలకు మాత్రమే ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. అలాగే, కాలేజీల ఆర్థిక స్థిరత్వం కోసం కార్పస్ ఫండ్ (Corpus Fund) నిర్వహణను తప్పనిసరి చేసింది.

ఈ నిధిని కేవలం కాలేజీ నిర్వహణ, అభివృద్ధి పనుల కోసమే వినియోగించాలని నిబంధన విధించింది.యూనివర్సిటీ నుంచి పొందే కన్సెంట్ ఆఫ్ అఫిలియేషన్(సీవోఏ) దరఖాస్తు చేసేనాటికి వాలిడిటీ కలిగి ఉండాలని సూచించింది. అసంపూర్ణ దరఖాస్తులను నోటీసు లేకుండానే రిజెక్ట్ చేస్తామని తెలిపింది. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలు మార్చి 18లోపు ఎన్‌ఎంసీకి మెయిల్ ద్వారా తెలియజేయాలని కోరింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: