అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను రేపుతున్నారు. టారిఫ్ విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపిన ట్రంప్ తగ్గేదేలే అంటూ ముందుకు పోతున్నారు. ఆయన తీసుకొచ్చిన సుంకాల పెంపుపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా ఐ డోన్ట్ కేర్ అంటున్నారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన అత్యవసర సుంకాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి విదితమే. అయితే ఈ తీర్పు వెలువడిన కొన్ని గంటలకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సార్వత్రిక సుంకాన్ని విధిస్తూ శుక్రవారం ఒక ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వుపై Trump సంతకం చేశారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Read Also: IT Ride : ఐటీ రైడ్లో సీక్రెట్ రూమ్.. రూ.కోట్ల విలువైన బంగారం!

ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా వెల్లడి
ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా వెల్లడించారు. అన్ని దేశాలపై గ్లోబల్ 10 శాతం సుంకంపై ఓవల్ ఆఫీస్ నుంచి సంతకం చేయడం నాకు గౌరవంగా ఉంది. ఇది దాదాపు వెంటనే అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రణాళికకు సంబంధించిన పూర్తి వివరాలను కార్యనిర్వాహక ఉత్తర్వులో, వైట్ హౌస్ శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో పొందుపరిచింది. అధ్యక్షుడు ఈ విధానాన్ని 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 ఆధారంగా అమలు చేస్తున్నారు. ఈ నిబంధన ప్రకారం భారీగా లేక తీవ్రమైన వాణిజ్య లోటులను తగ్గించేందుకు 150 రోజుల పాటు 15 శాతం వరకు సుంకాలను విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. వైట్ హౌస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ తాత్కాలిక దిగుమతి సుంకాలు ఫిబ్రవరి 24న అర్ధరాత్రి 12:01 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఈ సార్వత్రిక సుంకం నుంచి కొన్ని కీలక వస్తువులకు మినహాయింపు ఇవ్వనున్నట్లు కూడా వైట్ హౌస్ తెలిపింది. ముఖ్యమైన ఖనిజాలు, లోహాలు, గొడ్డు మాంసం, టమోటాలు వంటి వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే ఔషధాలు, ఎలక్ట్రానిక్స్ వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులు ఈ సుంకం పరిధి నుంచి బయట ఉంటాయి.
తీర్పుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం
అదేవిధంగా 2020లో ట్రంప్ తొలి పదవీకాలంలో కుదిరిన త్రైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా కెనడా, మెక్సికోలను కూడా ఈ కొత్త సుంకాల నుంచి మినహాయించనున్నట్లు వైట్ హౌస్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి.. మరో బాంబు పేల్చిన ట్రంప్.. ఈ కొత్త ఉత్తర్వు వాణిజ్య చట్టంలోని సెక్షన్ 232 కింద ఇప్పటికే అమలులో ఉన్న ఉక్కు, అల్యూమినియం సుంకాలను అలాగే సెక్షన్ 301 కింద చైనా వస్తువులపై విధించిన సుంకాలను యథాతథంగా కొనసాగిస్తుంది. ఇవి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి రాకపోవడంతో, కోర్టు నిర్ణయం వాటిపై ప్రభావం చూపలేదు. అదే సమయంలో శుక్రవారం సంతకం చేసిన మరో ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా, సుప్రీంకోర్టు కొట్టివేసిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విధించిన సుంకాలను రద్దు చేసే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. ఆ సుంకాలు ఇకపై వసూలు చేయబోవని ఆ ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో.. IEEPA చట్టాన్ని ఈ స్థాయిలో వినియోగించడం ద్వారా ట్రంప్ తన అధికారాలను మించిపోయారని పేర్కొంది. ఇది అధ్యక్షుడి ఆర్థిక ఎజెండాలో కీలకమైన అంశానికి పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తీర్పుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు నిర్ణయం తీవ్రంగా నిరాశపరిచింది అంటూ విమర్శించారు. అయితే, కోర్టు తీర్పును దాటవేయడానికి తన వద్ద ఇతర శక్తివంతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. వారి నిర్ణయం తప్పు. కానీ అది పెద్దగా పట్టింపు లేదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: