Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకులు, మెటల్ రంగ షేర్లలో బలమైన కొనుగోళ్లు జరగడంతో సూచీలు రాణించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 316 పాయింట్లు లాభపడి 82,814 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 116 పాయింట్లు పెరిగి 25,571 వద్ద ముగిసింది.
రంగాల వారీగా చూస్తే, ఐటీ, మీడియా మినహా మిగిలినవన్నీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ (Nifty) ఐటీ సూచీ 0.98 శాతం నష్టపోగా, పీఎస్‌యూ బ్యాంకింగ్ సూచీ 1.68 శాతం, మెటల్ సూచీ 1.25 శాతం చొప్పున లాభపడ్డాయి. పవర్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో కూడా కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. అయితే, మార్కెట్ బ్రెడ్త్ మాత్రం ప్రతికూలంగా ఉంది. 2,043 షేర్లు లాభపడగా, 2,511 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
Read Also: Swiggy: స్విగ్గీ ‘స్నాక్’ 10 నిమిషాల డెలివరీ ఎందుకు ఫెయిల్ అయ్యింది?

పీఎస్‌యూ బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్లకు లాభాలు
రోజు ప్రారంభంలో ఒడుదొడుకులకు లోనైనప్పటికీ, తక్కువ స్థాయిల వద్ద నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో మార్కెట్లు పుంజుకున్నాయని విశ్లేషకులు తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు, మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల కారణంగా సమీప భవిష్యత్తులో మార్కెట్ కొంత రేంజ్-బౌండ్లోనే ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.02 శాతం బలపడి 90.99 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కీలకమైన 61,200 స్థాయి పైన ముగియడం సానుకూల సంకేతమని, 61,000 స్థాయి కీలక మద్దతుగా, 61,350-61,400 స్థాయి తక్షణ నిరోధకంగా పనిచేయవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: