हिन्दी | Epaper

Superpowers : భారతదేశంవైపు అగ్రరాజ్యాల చూపు!

Sudha
Superpowers : భారతదేశంవైపు అగ్రరాజ్యాల చూపు!

భారతదేశం ప్రపంచ దేశాలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశంగా గోచరిస్తుందా అంటే అవును నిజమే అనిపిస్తుంది. ప్రపంచంలో అగ్రరాజ్యాలు అయిన అమెరికా, రష్యా, యూరప్ యూనియన్ లాంటి దేశాలు భారతదేశం తో వ్యాపార వాణిజ్య తదితర అంశాలలో మంచి సంబంధా లు కలిగి ఉంటున్నా, ఎన్నడూ లేని విధంగా భారత్ ప్రత్య క్షంగా రష్యా నుండి అధిక మొత్తంలో క్రూడ్ఆయిల్ దిగు మతి చేసుకుంటుందనే నెపంతో భారతదేశ వాణిజ్య వ్యాపా రంపై అమెరికా అత్యధిక టారిఫ్అంటే సుంకం విధానాన్ని అమలు చేసి రష్యా నుండి క్రూడాయిల్ దిగుమతి చేసుకో కుండా భారతదేశంపై ఒత్తిడి పెంచాలని ప్రయత్నాలు చేసి నా చివరకు కారణాలేవైనా భారతదేశంపై విధించిన సుంకా లను తగ్గిస్తున్నట్టు అమెరికా ప్రకటించడం, ఈ క్రమంలో అమెరికా చేసిన ప్రకటనపై భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. భారతదేశం రష్యాతో పాటు యూరోపియన్ దేశాలతో అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానంతో భారతదేశం ఎప్పుడూ శాంతి పక్షాన ఉంటుందని ప్రపంచంలో శాంతి యుత జీవనవిధానాలకు అనుగుణంగా ఉంటామని చెప్పిన మాటకు కట్టుబడి ఉండి ఆ దిశగా పురోగమిస్తున్న తరుణంలో అమెరికా అధికటారిఫ్ విధించి రష్యాతో భారత్కు ఉన్న వ్యాపార వాణిజ్యాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేసింది. తద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థను బలహీన పరచటాడానికి అనేక
రకాలుగా విశ్వప్రయత్నం చేసింది. ఎగుమతులు దిగు మతుల వస్తువులపై అత్యధిక సుంకాలను విధించినప్పటికీ, భారత్ కొంచెం కూడా ఆందోళన చెందక ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపే దృష్టి సారించింది.

Read Also : http://AI Impact Summit: భారత్ ‘పాక్స్ సిలికా’లో చేరిక – గ్లోబల్ AI భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం

Superpowers
Superpowers

ఊహాజనిత మైన వాదనలే..

భారతదేశం దేశ ప్రజల ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించింది తప్ప ఇతర దేశాల పెత్తనాన్ని భారత్ఎప్పుడూ సహించలేదు. ఇటీవల కాలంలో ఇండియా, రష్యా, వార్షిక శిఖరాగ్ర సభ కూడా జరగడం, భారతదేశానికి రష్యా అధ్యక్షుడు విచ్చేయడం వాణిజ్య వ్యాపార సంబంధాలు రక్షణ విషయంలో రష్యా మరింత దగ్గర కావడం అమెరికాకు అంతగా నచ్చలేదేమో కానీ, రష్యా, ఉక్రేయిన్ యుద్ధ సమయంలో రష్యా ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేందుకే భారత్ క్రూడ్ఆయిల్ను రష్యా నుండి ఎన్నడూ లేని విధంగా అధికంగా దిగుమతి చేసుకోవడం, వ్యాపార వాణిజ్య సంబంధాలు సైతం రష్యాతో జోరుగా సాగిస్తుంది అనే అమెరికా ఊహాజనిత మైన వాదనలే ప్రత్యక్షంగా పరోక్షంగా భారతదేశం ఎగుమ తులు, దిగుమతులపై సుంకాలను పెంపునకు కారణం కావచ్చు అనే భిన్న అభిప్రాయాలు లేకపోలేదు. భారత్ యూరోప్ యూనియన్ దేశాలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలతో ప్రత్యామ్నాయంగా వాణిజ్య వ్యాపార సం బంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నంలో ఉండగా ఎక్కడ భారతదేశంతో సత్సంబంధాలు తెగిపోతాయేమోనని కావచ్చు. తిరిగి భారత్తో వాణిజ్య వ్యాపార సంబంధం మెరుగుపరచుకోవడానికి ఇటీవల భారతదేశంపై విధించిన సుంకాలను తగ్గిస్తున్నట్టు ఒప్పందం జరిగిందని ప్రకటిం చింది. కానీ ఒప్పందంలో ఇరుదేశాల అగ్రనేతలు ఎక్కడ పాల్గొన్నట్లు కనిపించలేదు. కాకపోతే అమెరికా భారత్పై సుంకాలు తగ్గించినట్లు వచ్చిన వార్త నిజమే అన్నట్టు భారత దేశ సంబంధిత శాఖ కేంద్ర మంత్రి సూచప్రాయంగా తెలపడంతో ఈక్రమంలో ఒప్పందం వల్ల ప్రయోజనాల కన్నాఏమైనా నష్టాలున్నాయా తెలుపమని దేశంలోని ప్రతిపక్ష నాయకులు కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తడం తీవ్ర చర్చాంశంగా మారింది.

స్వయం శక్తి

గతం కంటే భారతదేశం అంతరిక్ష శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచంలో తిరుగులేని శక్తిగా మారు తుంది. విప్లవాత్మకమైన మార్పులతో వ్యాపార వాణిజ్య పరంగా అత్యధికంగా స్వయం శక్తితో ముందుకు పురోగమి స్తుంది. ప్రపంచ శాంతి సద్భావనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే ప్రత్యక్షంగా పరోక్షంగా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్న అత్యంత శక్తివంతమైన భారతదేశం ఇప్పుడు ప్రపంచ స్థాయిలోనే అగ్రరాజ్యాలను (Superpowers) సైతం అహింసా విధా నాలతో సై అంటే సై అని ఢీకొట్టే దమ్మున్న భారతదేశం వైపు ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తుండడం గమనార్హం. అయితే ఆ మెరికా నుండి భారతదేశంపై అధిక సుంకాలను తగ్గిస్తున్నట్టు ప్రకటన రాకముందు కొన్ని యూరోపియన్ దేశాల నేతలు అమెరికా భారత్ పైఅనుసరిస్తున్న విధానాన్ని పక్కనపెట్టి భారత దేశంతో వ్యాపార వాణిజ్యాలు చేసుకు నేందుకు ముందుకు రావడం విశేషం. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షులు ఇటీవల భారతదేశాన్ని సంద ర్శించడంతో పాటు భారతదేశం గణతంత్ర వేడుకల్లో పాల్గొ నడం ప్రపంచదృష్టిని ఆకర్షించింది. పరోక్షంగా నైనా భారత దేశం రష్యా స్నేహబంధం మధ్య దూరాన్ని తగ్గించాలను కోవడం అంత సులువు కాదేమో అని అమెరికా గ్రహించింది కావచ్చు. అమెరికా కూడా చివరకు భారతదేశంతో సత్సం బంధాలు వదలుకోవడానికి సాహసించలేదు అనే రీతిలో భారతదేశ వాణిజ్య వ్యాపారులపై ఎగుమతులు దిగుమతులపై సుంకాలను తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఏది ఏమైనప్పటికీ ప్రపంచంలో వివిధ దేశాలపై ఎగుమతులు, దిగుమతులపై అసమతుల్యమైన టారిఫ్ విధానాన్ని వివిధ దేశాల మధ్య అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెర వెనుక అత్యంత శక్తివంతమైన దక్షిణాసియా దేశాలైన చైనా రష్యా, భారత్ లాంటి దేశాలు ఏకమైతే అగ్రరాజ్యమైన (Superpowers) అమెరికా పరిస్థితి ఎలా ఉంటుందో అమెరికా ఊహించుకుం దేమోకానీ ఇక లాభం లేదు అనుకునే రీతిలో భారతదేశంపై అనవసరంగా అధిక సుంకాలను విధించడం అమెరికా తమ దేశప్రయోజనాలకు మంచిది కాదని భావించి ఉండవచ్చు. ఇదే రీతిలో భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానం ప్రపంచ శాంతి సౌభాగ్యం సద్భావన మంచి స్నేహ సంబం ధాలు ప్రజల మధ్య సఖ్యత పరస్పర సహకారం అహింసా వాదం లాంటి నిర్దిష్టమైన విధానాలు అనుసరిస్తున్న తరు ణంలో అమెరికా, రష్యా లాంటి దేశాలతో
పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు భారత దేశంతో కలిసి వాణిజ్య వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరుచుకోగలవని ఆశించడంలో సందేహంలేదు.
-దాడిశెట్టి శ్యామ్ కుమార్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870