हिन्दी | Epaper

Lucky The Super Star: ‘లక్కీ ది సూపర్ స్టార్’ మూవీ రివ్యూ

Saritha
Lucky The Super Star: 'లక్కీ ది సూపర్ స్టార్' మూవీ రివ్యూ
Lucky The Super Star: ‘Lucky The Super Star’ Movie Review

Lucky The Super Star: తమిళంలో రూపొందిన సినిమానే ‘లక్కీ ది సూపర్ స్టార్’. జీవీ ప్రకాశ్ కుమార్ – అనశ్వర రాజన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి ఉదయ్ మహేశ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నేరుగా ఈ రోజునే ‘జియో హాట్ స్టార్’లో(Jio Hotstar) విడుదలైంది. ‘లక్కీ’ అనే ఒక కుక్క పిల్ల చుట్టూ తిరిగే కథ ఇది.

Read Also: Hollywood Actor Eric Dane Passes Away: నటుడు ఎరిక్ డేన్ కన్నుమూత

కథ

లక్ష్మణ్ అక్కాబావలు శ్రీనివాసన్ – అనూ సిటీలో నివసిస్తూ ఉంటారు. వాళ్ల సంతానమే ‘అమ్ములు’. ఆ పాప ‘ఆటిజం’తో బాధపడుతూ ఉంటుంది. శ్రీనివాసన్ ఒక పెద్ద సంస్థలో పని చేస్తూ ఉంటాడు. ఆయన ద్వారా ఆ కంపెనీలో జాబ్ సంపాదించవచ్చని లక్ష్మణ్ కూడా సిటీకి వచ్చేస్తాడు. అక్కాబావల దగ్గర ఉంటూ ‘అమ్ములు’ను చూసుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ప్రమాదం బారిన పడబోయిన ఒక వీధి కుక్కపిల్లను కాపాడి, దానిని ఇంటికి తీసుకుని వస్తాడు లక్ష్మణ్. 
అందరూ కలిసి ఆ కుక్కపిల్లకి ‘లక్కీ’ అనే పేరు పెడతారు. లక్కీ వచ్చిన దగ్గర నుంచి ‘అమ్ములు’లో మంచి మార్పు కనిపించడం మొదలుపెడుతుంది. లక్ష్మణ్ తో గొడవపడిన కౌన్సిలర్ గణేశ్ మూర్తి మనుషులు, ‘లక్కీ’ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళతారు. మరో కుక్కపిల్ల కోసం వెదుకుతున్న లక్ష్మణ్ కీ, కీర్తి తారసపడుతుంది.         

లక్కీ అడుగుపెట్టడమే ఆలస్యం అదృష్టం కలిసొస్తుందనే విషయం కౌన్సిలర్ కి అర్థమవుతుంది. దాంతో వెంటనే ఆ కుక్కపిల్ల ఎమ్మెల్యే ఇంటికి చేరుకుంటుంది. ఎమ్మెల్యే కి కూడా ఇదే విషయం అనుభవంలోకి వస్తుంది. ఫలితంగా ఆ కుక్కపిల్ల ముఖ్యమంత్రి ఇంటికి చేరుకుంటుంది. లక్కీపై బెంగతో అమ్ములు హాస్పిటల్ పాలవుతుంది. అమ్ములును దక్కించుకోవాలంటే, ముఖ్యమంత్రి దగ్గరున్న లక్కీని తీసుకురావలసిన బాధ్యత లక్ష్మణ్ పై పడుతుంది. అప్పుడతను ఏం చేస్తాడు? ఆ ప్రయత్నంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడు? అనేది కథ.

ప్రధానమైన పాత్ర

ఈ సినిమా పోస్టర్స్ చూసిన వాళ్లు ఈ కథలో ‘కుక్కపిల్ల’ ఒక భాగం కావొచ్చు అనుకుంటారు. కానీ ఈ కథ తిరిగేదే కుక్కపిల్ల చుట్టూ. కరెక్టుగా చెప్పాలంటే ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర కుక్కపిల్లదే. జీవీ ప్రకాశ్ కుమార్ అనశ్వర రాజన్ ను జంటగా తీసుకున్నప్పటికీ, లవ్.. రొమాన్స్ దిశగావాళ్లను ఎంత మాత్రం వాడుకోలేదు. 

జీవీ ప్రకాశ్ కుమార్ – అనశ్వర రాజన్ తో పాటు, ఎవరి నటన గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. దర్శకుడు పూర్తిగా కుక్కపిల్లపైనే దృష్టి పెట్టడం వలన, ఇక మిగతా పాత్రలను డిజైన్ చేసే విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఏ పాత్ర కూడా తన వైపు నుంచి కథను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోతుంది. ప్రీ క్లైమాక్స్ లో కాస్త హడావిడి కనిపిస్తుందంతే. క్లైమాక్స్ కూడా అందరూ గెస్ చేసేదిగానే ఉంటుంది. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870