ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కేసులో బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన మాజీ ప్రిన్స్ ఆండ్రూ (PRINCE ANDREW) మౌంట్ బాటెన్ విండ్సర్ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఆయనకు సంబంధించి కీలక విషయాలు బయటపడ్డాయి. బ్రిటన్ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 6 నుంచి 8 ఏళ్ల వయసున్న బాలికకు లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడని.. ఆ సమయంలో ఆండ్రూ కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నాయి. ఆ బాలికను టేబుల్‌పై బంధించి ఈ దారుణానికి పాల్పడ్డట్లు ఓ గుర్తుతెలియని వ్యక్తి చెప్పినట్లు వెల్లడించాయి. ఈ ఆరోపణలు FBI పత్రాల్లో ఉన్నాయని.. బ్రిటన్‌లోని ఫ్రాగ్మోర్ కాటేజ్‌లో ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొన్నాయి. కానీ ఆండ్రూ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వచ్చారు.
Read Also: Bandi Sanjay: మంత్రుల అవినీతి చిట్టా బయటపెడతా

ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ రెండు ఘటనలకు సంబంధం లేదని చెప్పారు. దీనికి సంబంధించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే తమకు అందించాలన్నారు. ఇదిలాఉండగా ఆండ్రూ.. జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు పెట్టుకోవడం, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసందే. కొన్ని గంటల పాటు విచారించిన తర్వాత ఆయన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: