LB Nagar Chutneys Hotel Explosion: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని చట్నీస్ హోటల్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు శబ్దానికి కస్టమర్లు భయపడి పరుగులు తీశారు.ఇడ్లీ స్టీమర్లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేడికి కారణంగానే స్టీమర్ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటన ఫై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Epstein Files: బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్!

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: