Kokapet crime: హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కోకాపేటలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఒక డాక్టర్ నివాసంలో పిల్లల సంరక్షణ కోసం (నానీగా) పనిచేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Also: POCSO: విశాఖలో ఘోరం: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం

మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నందినిగా గుర్తింపు
మృతురాలిని మహబూబ్నగర్ జిల్లా ధర్మాపురం గ్రామానికి చెందిన నందినిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఆత్మహత్య(Suicide)కు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు, అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: