हिन्दी | Epaper

US: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్​లైన్!

Vanipushpa
US: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్​లైన్!

అణు ఒప్పందం అంశంపై ఇరాన్(Iran)– అమెరికా(America) మధ్య తీవ్ర ఉదిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్​కు అల్టిమేటం జారీ చేశారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు. వాషింగ్టన్‌లో జరిగిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ సమావేశం, ఆ తర్వాత విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ విషయంలో తనలో సహనం నశించిందని స్పష్టం చేశారు. ఏదో ఒక ఒప్పందానికి రావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇరాన్‌కు అత్యంత దురదృష్టకరమైన పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు. అణు ఒప్పందంపై నిర్ణయం తీసుకోవడానికి 10 నుంచి 15 రోజుల సమయం గరిష్టంగా సరిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తన అణు మొండితనాన్ని వీడకపోతే, తాము సైనిక చర్య వేయక తప్పదని ఆయన పరోక్షంగా యుద్ధ సంకేతాలు ఇచ్చారు.

Read Also: Tamil Nadu: ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

US: Trump ultimatum to Iran..15-day deadline!
US: Trump ultimatum to Iran..15-day deadline!

ఇరాన్ మాతో చేతులు కలపాల్సిన సమయం వచ్చింది

“మేము చేపట్టిన అణు నివారణ చర్యలను పూర్తి చేసే మార్గంలో ఇరాన్ మాతో చేతులు కలపాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ వారు మాతో కలిస్తే అది చాలా మంచిది. వారు మాతో కలవకపోయినా అది కూడా మంచిదే. కానీ, ఆ తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. ఒప్పందంపై ఎక్కువ రోజు సాగదీయలేం. ఇరాన్ కచ్చితంగా ఒప్పందానికి రావాలి. ఒకవేళ అలా జరగకపోతే, ఒప్పందం కుదరని పక్షంలో చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు మేము దీనిని మరో మెట్టు ముందుకు తీసుకెళ్లాల్సి రావచ్చు. బహుశా మేము ఒక ఒప్పందానికి రావచ్చు. రాబోయే 10 రోజుల్లో ఒప్పందంపై నిర్ణయం తెలుస్తుంది” అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870