हिन्दी | Epaper

Minister Narayana: ఏప్రిల్ 2027కి రాజధానిలోని ప్రధాన రహదారులు పూర్తి

Pooja
Minister Narayana: ఏప్రిల్ 2027కి రాజధానిలోని ప్రధాన రహదారులు పూర్తి

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించిన మంత్రి నారాయణ

విజయవాడ : Minister Narayana: రాజధానిలోని ప్రధాన రహదారులు (ట్రంక్ రోడ్లు) ఏప్రిల్ 2027కి పూర్తి చేసేందుకు ప్రణాళిక చేశామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మొదటి దశలో 67.6 కిలోమీటర్ల నిర్మాణం, గుంటూరు జిల్లాలో 14, పల్నాడులో 3, కృష్ణాలో 6, ఎన్టీఆర్లో జిల్లాలో 3 గ్రామాలు, మొత్తం 26 గ్రామాల ద్వారా నిర్మాణం జరుగుతుంది. దీనికోసం డీపీఆర్ కూడా సిద్ధమయ్యింది. ఈ నిర్మాణానికి భూ సమీకరణ కూడా ప్రారంభించాం. ఆరు నెలల్లో భూ సమీకరణ పూర్తి చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.

Read Also:Minister Narayana: అమరావతిలో 7 సంస్థలకు భూ కేటాయింపులు

Minister Narayana
Minister Narayana: Major roads in the capital to be completed by April 2027

2027 నాటికి ట్రంక్ రోడ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. శాసనసభలో అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఇన్నర్రింగ్ రోడ్డులో 96.2. కి.మీ పొడవు, 75 మీటర్ల వెడల్పుతో 8+4 వరసల రోడ్డు నిర్మాణానికి డిజైన్ చేశామని మంత్రి తెలిపారు. దీని నిర్మాణం రెండు ఫేజ్లో జరుగుతుందని, అది పీపీపీ విధానంలో చేపట్టినట్లు తెలిపారు. రాజధానిలోని ట్రంక్ రోడ్ల మోలిక సదుపాయాలు ఏడీబీ, ప్రపంచ బ్యాంకు, హడ్కో, నాబార్డ్, వివిధ సంస్థల ద్వారా రూ.40,847 కోట్లు సమకూర్చామని మంత్రి వివరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూ సమీకరణ అయ్యాక అభివృద్ధి కోసం కనీసం 24 నుంచి 30 నెలల సమయం పడుతుందన్నారు. మొదటి ఫేజ్లో కేతనకొండ నున్న వరకు, రెండో ఫేజ్లో నున్నకేతనకొండ వరకు నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ వివరించారు.

వ్యవసాయానికి 200-500 యూనిట్లు ఉచితం

రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 22,30,703 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు డిస్కంల వరిధిలో 1,02,538 కనెక్షన్లు ఇచ్చామన్నారు. వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్లో ఉన్న 46 వేల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. 2025- 26 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు ఉచిత వ్యవసాయ కనెక్షన్ల కోసం రూ.839.44 కోట్లు ఖర్చు చేశామన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో 2,61,481 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని వివరించారు. ఫీడర్ లెవల్ సోలార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి రూ.1,059 కోట్లు ఆదా అవుతుందన్నారు. ఏప్రిల్ నుంచి వీవర్స్కు 200500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్మెన్ల కొరతపై బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇస్తూ ఆ పోస్టుల ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్మెన్ పోస్టులు 260, ఆసిస్టెంట్ లైన్ మెన్లు 1084, లైన్మెన్ పోస్టుల్లో 22 ఖాళీలు ఉన్నాయన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవల కోసం త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం అవుట్ సోర్సింగ్ విధానంలో 8770 మంది పని చేస్తున్నారన్నారు. లోడ్ ఆధారంగా విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

బడ్జెట్ పై చర్చలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు

ఈ బడ్జెట్ ప్రతిపాదనలు చంద్రబాబు విజనరీ, పవన్కల్యాణ్ స్ఫూర్తిని రంగరించుకుని చేసినట్లు ఉందని బడ్జెట్పై చర్చలో భాగంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. వైద్యారోగ్య రంగంలో గతంలో ఎన్నడూలేనంత అభివృద్ధి చేశారన్నారు. విద్యారంగంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషి మరువలేనిదని, ఇదొక సువర్ణ అధ్యాయం అని తెలిపారు. సామాన్యుడికి విద్యా విధానం, ప్రతి మండలంలోనూ ఒక డిగ్రీ కళాశాల ఉండేలా చూడాలని కోరారు. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ.. వెనుకబడి తరగతుల వారికి, గిరిజనులకు బడ్జెట్ కేటాయింపులు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి మాట్లాడుతూ.. జలవనరుల అభివృద్ధి ద్వారా రాష్ట్రం ముందుకెళుతుందని, అయితే అదే సందర్భంలో జలవనరులశాఖలో పూర్తికాని ప్రాజెక్టులు చాలా ఉన్నాయని తెలిపారు. వాటిని పూర్తి చేయడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వాడుకోవడం ద్వారా విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.

పెట్టుబడి ఖర్చును రూ.48 వేల కోట్లని చెప్పి రూ.3 రూ.33 వేల కోట్లకు సవరించారని అన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని దెబ్బతీసిం దని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాలనలో రాష్ట్రం ముందుకెళుతోందని అన్నారు. ఎమ్మెల్యే బందారు సత్యానంద రావు మాట్లాడుతూ గత పాలన మొత్తం అప్పులతో సాగింది “ని, దివాళా తీసిందని అన్నారు. బంగారు బాతులాంటి అమరావతిని సర్వనాశనం చేశారని తెలిపారు. తాడేపల్లిగా గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పాలే లేకండా నెయ్యి తయారు చేశారని, దేవుడికి చేసిన తప్పుకు అధికారం కోల్పోయారని అన్నారు. ధాన్యంకూడా సరైన రీతిలో కొనుగోలు చేయకుండా రైతులను వైసిపి పాలకులు మోసం చేశారని అన్నారు. కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం ద్వారా విద్యార్థులకు కడుపునిండా అన్నం పెడుతున్నామని అన్నారు. ఇటువంటి పాలన గతంలో ఎన్నడూ జరగలేదని తెలిపారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆరోగ్యం కూడా సమాజానికి అవసరమని తెలిపారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజన విద్యార్థులకు ఆరోగ్యం, విద్య అత్యంత అవసరమని అన్నారు. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ బడ్జెట్ ప్రతిపాదనలు ప్రతి మహిళా అభివృద్ధి చెందేందుకు వీలుగా ఉందని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870