हिन्दी | Epaper

AP Job Calendar March: ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్

Anusha
AP Job Calendar March: ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్

AP Job Calendar March: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా ‘జాబ్ క్యాలెండర్’ విడుదలకు రంగం సిద్ధమైంది. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, నోటిఫికేషన్ల విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Read Also: Tirumala: వేదాశీర్వచనానికి మేలాఛాట్ వస్త్రాల కొరత!

ap-job-calendar-march-job-calendar-released-for-ugadi-minister-lokesh
ap-job-calendar-march-job-calendar-released-for-ugadi-minister-lokesh

వచ్చే నెలలో రానున్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అందులో యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించాలని సూచించారు. దీని వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించారు. ఇక త్వరలోనే నైపుణ్య వెబ్ సైట్ ప్రారంభించనున్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. పోర్టల్ కోసం ఇప్పటికే మాడ్యూల్స్ సిద్దం కాగా.. 25 రకాల డేటా ఇంటిగ్రేషన్ పూర్తయింది.

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు

ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇందులో రిజిస్టర్ అవ్వగా.. అభ్యర్థులు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించారు. 16 మంది రిక్రూటర్స్ సిద్దంగా ఉండగా.. 1,14,899 ఉద్యోగాలు సిద్దంగా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఐటీఐలకు అనుబంధంగా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870