Trump reaction obama : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రహాంతరవాసులు (ఏలియన్లు) ఉన్న అవకాశంపై ఒబామా చేసిన వ్యాఖ్యలు అత్యంత రహస్య సమాచారాన్ని బయటపెట్టినట్టేనని ట్రంప్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తున్న ట్రంప్‌ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, “ఒబామా ఏలియన్లు నిజమన్నారు… భూమిని వారు సందర్శించారనే ఆధారాలున్నాయా?” అని అడిగారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ, “వారు రహస్య సమాచారాన్ని బయటపెట్టారు. అలా చేయకూడదు. అది పెద్ద తప్పు,” అన్నారు. ఏలియన్లు నిజమా కాదా అన్న ప్రశ్నకు, “నిజమో కాదో తెలియదు, కానీ రహస్య విషయాలు బయటకు రావడం సరైంది కాదు” అని చెప్పారు.
Read Also: Azharuddin Minister Post : అజహరుద్దీన్ పదవికి గండం ?

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఒబామా సరదాగా మాట్లాడుతూ, “ఏలియన్లు ఉండే అవకాశం ఉంది. కానీ నేను వారిని చూడలేదు, ఏరియా 51లో దాచిపెట్టలేదు,” అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై చర్చ మొదలవడంతో ఆయన సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. విశ్వం ఎంతో విస్తారమైందని, గణాంకాల ప్రకారం ఎక్కడో జీవం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, తన అధ్యక్ష పదవీకాలంలో భూమిని గ్రహాంతరవాసులు సంప్రదించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
గతంలో కూడా ట్రంప్ యూఎఫ్‌వోలు మరియు గ్రహాంతరవాసుల అంశంపై స్పందిస్తూ, వాటిపై పూర్తిగా నమ్మకం లేదని, అయితే విశ్వంలో ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: