Chandragiri RTC Bus Accident: తిరుపతి-చిత్తూరు హైవేపై చంద్రగిరి మండలం ఇరంగారిపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఆగి ఉన్న టాటా ఏసీ వాహనాన్ని, ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా ఏసీ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో వాహనాల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం
ప్రమాదం జరిగిన తీరు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మంగళం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పి.చంద్రయ్య తిరుపతి నుండి పాకాలకు వెళ్తుండగా, మార్గమధ్యంలో నిలిపి ఉంచిన వాహనాలను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ధ్వంసమైన టాటా ఏసీ వాహనం ఇరంగారిపల్లికి చెందిన బి.మునికృష్ణదిగా పోలీసులు గుర్తించారు. బస్సు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు.

Chandragiri RTC Bus Accident: పోలీసుల దర్యాప్తు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పాకాల ఎస్.ఐ తరుణ్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ధ్వంసమైన వాహనాలను పరిశీలించి, హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, డ్రైవర్ అజాగ్రత్త వల్ల ప్రమాదం జరిగిందా లేదా సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: