Airtel Update: టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) తన వినియోగదారులకు షాకిస్తూ గతంలో ప్రకటించిన భారీ ఆఫర్ నుండి వెనక్కి తగ్గింది. ఏఐ సెర్చ్ ప్లాట్‌ఫారమ్ ‘పర్‌ప్లెక్సిటీ ప్రో’ (Perplexity Pro) తో కుదుర్చుకున్న ఒప్పందానికి స్వస్తి పలికింది. అయితే, దీనికి బదులుగా మరో కొత్త ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది.
Read Also: POCSO: విశాఖలో ఘోరం: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం
పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ ముగింపు

గతేడాది జూలైలో ఎయిర్‌టెల్ తన 360 మిలియన్ల వినియోగదారులకు సుమారు రూ. 17,000 విలువైన ‘పర్‌ప్లెక్సిటీ ప్రో’ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా ప్రకటించింది. కానీ ఫిబ్రవరి 18, 2026 నాటికి ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు పూర్తిగా నిలిచిపోయింది. జనవరి 16వ తేదీ లోపు క్లెయిమ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
పాత వినియోగదారులు జాగ్రత్త!
ఇప్పటికే ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సేవలను కొనసాగించే క్రమంలో యాప్ బిల్లింగ్ వివరాలు లేదా క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని అడుగుతోంది. ఉచిత కాలపరిమితి ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యే (Auto-renewal) అవకాశం ఉన్నందున, అవసరం లేని పక్షంలో ముందే సబ్‌స్క్రిప్షన్ రద్దు చేసుకోవడం ఉత్తమం.
కొత్తగా అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ఆఫర్
పర్‌ప్లెక్సిటీతో భాగస్వామ్యం ముగియడంతో ఎయిర్‌టెల్ తన యూజర్ల కోసం ‘అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం’ (Adobe Express Premium) ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని విలువ మార్కెట్లో రూ. 4,000 వరకు ఉంటుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ప్రిపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 12 నెలల పాటు ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు.
నిర్ణయానికి కారణమేంటి?
భారత మార్కెట్లో ఏఐ వినియోగం పెరుగుతున్నా, కోట్లాది మందికి అత్యంత ఖరీదైన సబ్‌స్క్రిప్షన్లు ఇవ్వడం కంపెనీపై ఆర్థిక భారాన్ని పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యయ నియంత్రణలో భాగంగానే ఎయిర్‌టెల్ ఈ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: