हिन्दी | Epaper

Telangana Mobile Anganwadi Services: స్లమ్ ఏరియాల్లో మొబైల్ అంగన్వాడీలు

Tejaswini Y
Telangana Mobile Anganwadi Services: స్లమ్ ఏరియాల్లో మొబైల్ అంగన్వాడీలు

Telangana Mobile Anganwadi Services: దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని స్లమ్ ఏరియాల్లో ఈ మొబైట్ అంగన్వాడీలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. భవనాల కొరత, సాంకేతిక సమస్యలు, అలాగే కొత్త అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో మొబైట్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

Read Also: Telangana Budget 2026: రోడ్ల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు – మంత్రి కోమటిరెడ్డి వెల్లడి

Telangana Mobile Anganwadi Services: Mobile Anganwadis in slum areas
Telangana Mobile Anganwadi Services: Mobile Anganwadis in slum areas

తొలుత ఈ విధానాన్ని హైదరాబాద్లో పాటు, చుట్టు పక్కల జిల్లాల్లో అమలు చేయనుంది. దీనికి సంబంధించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే మొబైల్ అంగన్వాడీ(Mobile Anganwadi) సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ మున్సిపాల్టీ వరిధిలో వలస కారుకులు అధికంగా నివసించే ప్రాంతాలు, బస్తీలు, స్లమ్ ప్రాంతాల్లో అంగన్వాడీ సేవలను సరికొత్తగా అందించే దిశగా అధికారులు చర్యలు రేపట్టారు.

లేక్ హోం రేషన్ విధానంలో

లేక్ హోం రేషన్ విధానంలో అర్హుల నివాసాలకే సరుకులు అందించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇందులో బాలమృతం, పాలు, స్నాక్స్, కోడి గుడ్లు, బియ్యం తదితర పోషకాహార పదార్థాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం అమలుకు సంవత్సరానికి సుమారు రూ.శ కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే మొబైల్ అంగన్వాడీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 37 వాహనాలను సిద్ధం చేసి, వాటి ద్వారా 274 స్లమ్ ఏరియాలను కవర్ చేస్తూ. పౌష్టికాహారం అందించడమే లక్ష్మ సంక్షేమ శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. జిల్లా వారీగా హైదరాబాద్ లో 7, మేడ్చెల్ మల్కాజిగిరిలో 15, సంగారెడ్డిలో 1, రంగారెడ్డిలో 14 వాహనాలను వినియోగించనున్నారు. ఈ మొబైల్ కేంద్రాలను సమీప అంగన్వాడీ కేంద్రాలకు అనుబంధంగా నిర్వహిస్తారు. ఫలితంగా అర్హులు ఎక్కడ ఉంటారో వాళ్లు ఉండేచోటనే సరుకులను అందిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870