हिन्दी | Epaper

Panchayat Secretary Transfers: మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: మంత్రి సీతక్క

Tejaswini Y
Panchayat Secretary Transfers: మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: మంత్రి సీతక్క

Panchayat Secretary Transfers: జిఒ నం.317 కారణంగా స్థానికత కోల్పోయి దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న 223 మంది పంచాయతీ కార్యదర్శులకు రెండు సంవత్సరాలపాటు అంతర్ జిల్లా డిప్యూటేషన్పై నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) వెల్లడించారు. ఈ మేరకు సచివాలయంలో పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భం గా అసోసియేషన్ సభ్యులను అభినందిస్తూ గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు.

Read Also: Telangana Budget 2026: రోడ్ల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు – మంత్రి కోమటిరెడ్డి వెల్లడి

Panchayat Secretary Transfers: Ours is an employee-friendly government: Minister Seethakka
Panchayat Secretary Transfers: Ours is an employee-friendly government: Minister Seethakka

రేవంత్రెడ్డి నాయకత్వంలోని

సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల అనుకూలమైన ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోం దని,జిఒ 317తో నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించి అంతర్ జిల్లా డిప్యూటేషన్లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఈ నిర్ణయంతో 223 మంది పంచాయతీ కార్యదర్శులకు భారీ ఊరట లభించిందన్నారు. పంచాయతీ సెక్రటరీల మిగిలిన సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం సాను కూలంగా ఉందని, అధికారులతో చర్చించి అవస రమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.

జీవో నెం.317తో నష్టపోయిన పంచాయతీ కార్య దర్శులకు న్యాయం చేస్తూ అంతర్ జిల్లా డిప్యు టేషన్లకు అనుమతులు మంజూరు చేసినందుకు మంత్రికి కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క కృషితోనే జీవో.317లో ఉన్న లోపాలను సరిదిద్దే అంశంలో పంచాయతీరాజ్శాఖ ముందంజలో నిలిచిందన్నారు. జీవో ప్రతులను మంత్రి చేతుల మీదుగా స్వీకరించిన కార్యదర్శులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్ఏ అధ్య క్షుడు పి. మధుసూదనరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీనివాస్, ట్రెజరర్ జె. పాండరి నాథ్, ఉపాధ్యక్షుడు సి.నాగేశ్, ఆర్గనైజింగ్ సెక్ర టరీ బి. సురేష్ గౌడ్, ఈసీ సభ్యులు ఎం. కవితా దేవి, ఆర్. వేణు తదితరలు పాల్గోన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870