EPFO: ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక గొప్ప కల. దీని కోసం ఉద్యోగస్తులు తమ సంపాదనలో కొంత భాగాన్ని ఏళ్ల తరబడి పొదుపు చేస్తారు. సాధారణంగా పొదుపు చేసిన నగదు లేదా బ్యాంక్ హోమ్ లోన్ల ద్వారా ఇల్లు నిర్మించుకుంటారు. అయితే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. మన రిటైర్మెంట్ కోసం దాచుకునే ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) నిధులను కూడా ఇంటి నిర్మాణం కోసం వాడుకోవచ్చు.
Read Also: Tirupathi : శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ
నిబంధనల్లో మార్పులు
పీఎఫ్ నగదును తీసుకోవాలంటే కారణం ఏంటనేది వెల్లడించాల్సి ఉంటుంది. అందులో భాగంగా మీరు హోమ్ లోన్ తిరిగి చెల్లించడానికి, ఇంటిని పునరుద్ధరించడానికి, కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి, ఇల్లును కొనుగోలు చేయడానికి పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం ప్రక్రియను మరింత సులభతరం చేశారు. ఉపసంహరణ పరిమితులు, నిబంధనలను సడలించారు. ఈపీఎఫ్‌వో 3.0లో ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ నుంచి వీటిని అమలు చేయనున్నారు.

అర్హతలు ఇవే..
-ఈపీఎఫ్‌వో సభ్యుడు అయి ఉండాలి -యూఏఎన్ యాక్టివ్‌గా ఉండాలి -కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి -ఇల్లు మీ పేరు, మీ జీవిత భాగస్వామి లేదా ఉమ్మడి పేరు మీద ఉండాలి -ఆస్తి యాజమాన్యాన్ని నిరూపించే డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి -ఇల్లు కొనుగోలుకు లేదా నిర్మించేందుకు తీసుకోవాలంటే మూడు నుంచి ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి -ఇక హోమ్ లోన్ చెల్లించడానికి తీసుకోవాలంటే 10 సంవత్సరాల వ్యవధి ఉండాలి
ఎంత డబ్బు తీసుకోవచ్చు
మీ పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తంలో 90 శాతం వరకు తీసుకోవచ్చు. 36 నెలల పాటు మీ బేసిక్ శాలరీ, DA మొత్తాన్ని మించకూడదు. ఈ రెండు మొత్తాలలో తక్కువ మొత్తం మీ PF క్లెయిమ్‌కు జమ చేయబడుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న ఇంటికి మరమ్మత్తులు లేదా పునరుద్ధరించడం కోసం తీసుకోవాలంటే ఇంటి నిర్మాణం పూర్తై కనీసం ఐదు సంవత్సరాల అయి ఉండాలి. 100 శాతం నగదు తీసుకోవడవానికి అనుమతించరు. ఇక ఫారం 31ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేసి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లో నగదు మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. డాక్యుమెంట్స్ సరిగ్గా అప్లోడ్ చేయకపోయినా, తప్పులు ఉన్నా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. దీంతో సరైన వివరాలు అందించాల్సి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: