EAPCET 2026 : ఎంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్–2026లో అధికారులు కీలక మార్పులు చేశారు. ఈసారి పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. పరీక్ష పూర్తయ్యగానే కంప్యూటర్ స్క్రీన్‌పై తమకు వచ్చిన మార్కులు వెంటనే కనిపించేలా కొత్త విధానం అమలు చేస్తున్నారు. అలాగే ఆ మార్కులకు సుమారు ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉందో కూడా విద్యార్థులు తెలుసుకునేలా గత సంవత్సరాల డేటాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ మొబైల్ ఫోన్ ద్వారానే అప్లై చేసే సదుపాయాన్ని తీసుకొచ్చారు. మొబైల్ లేదా ట్యాబ్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా మొబైల్ అడాప్టివ్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు సమయంలో విద్యార్థి ఎంపీసీ/బైపీసీ ఎంపికలో పొరపాటు చేస్తే నిర్వాహకుల నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందించే కొత్త పర్యవేక్షణ విధానం కూడా అమల్లోకి వచ్చింది. దీంతో దరఖాస్తులో తప్పులు తగ్గే అవకాశముంది.
Read Also: Sunitha: విడాకులు ఇచ్చిందనే కోపంతో హత్య చేసిన భర్త

గురువారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. పరీక్షకు రెండు రోజుల ముందువరకు రూ.10,000 లేట్ ఫీజుతో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 4,5 తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షలు మే 9,10,11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఎస్సీ 1,2,3 రిజర్వేషన్ విధానాన్ని కూడా అమలు చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: