IND vs NED: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో వరుస విజయాలతో ఇప్పటికే సూపర్-8 బెర్త్‌ను ఖరారు చేసుకున్న టీమిండియా, గ్రూప్-ఏలో భాగంగా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ ఉండటం కెప్టెన్‌గా తనకు తలనొప్పేనని చమత్కరించాడు. శివమ్ దూబే అసాధారణ ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు. ‘మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. 190 పరుగులు చేయగలిగాం.
Read Also: T20WC 2026: ఆసీస్ ఎలిమినేషన్‌పై రికీ పాంటింగ్ ఏమన్నారంటే?
నాకు తలనొప్పినే
మైదానంలో కొంచెం మంచు ఉంది. అది మా బౌలర్లకు కొంత సవాలుగా మారింది. కానీ ఆశించిన ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేం కొన్నిసార్లు తొందరగా వికెట్లు కోల్పోవచ్చు. కానీ అప్పుడు బ్యాటర్లు తమ బాధ్యత ఏంటో అర్థం చేసుకోవడం ముఖ్యం.మా బ్యాటింగ్ లైనప్‌లో మెరుపులు మెరిపించే ఫైర్ పవర్ ఆటగాళ్లు ఉన్నారు. శివమ్ దూబే విశాఖ వేదిగా న్యూజిలాండ్‌తోనూ ఇలాంటి ఇన్నింగ్సే ఆడాడు. ఆ రోజు అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవాలనుకున్నాడు.

కానీ ఈ రాత్రి అతను జట్టుకు 190 పరుగుల భారీ లక్ష్యం అందించడం అద్భుతం.మేం అనుకున్నవన్నీ సరిగ్గా చేయగలిగాం. గెలిచినప్పుడు కూడా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఈ రోజు కూడా అనేక విషయాలు నేర్చుకున్నాం. మా జట్టులో ఎక్కువ బౌలింగ్ ఆప్షన్లు ఉండటం కెప్టెన్‌గా నాకు తలనొప్పినే. పిచ్ తగ్గట్లు మా బౌలర్లు రాణించగలరు. ప్రస్తుతం మా ఫలితాల పట్ల సంతోషంగా ఉన్నాను. ప్రతీ బ్యాటర్ నుంచి సహకారం అందుతోంది. ఒకరిద్దరికి అద్భుతమైన రోజు ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కరి నుంచి సహకారం అందడం మాకు అవసరం.’అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: