हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

IND vs NED: సిరాజ్ జెర్సీతో బరిలోకి దిగిన అభిషేక్.. ఎందుకోతెలుసా?

Aanusha
IND vs NED: సిరాజ్ జెర్సీతో బరిలోకి దిగిన అభిషేక్.. ఎందుకోతెలుసా?

IND vs NED: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్ ఏ ఆఖరి పోరులో నెదర్లాండ్స్‌ను 17 పరుగుల తేడాతో ఓడించి భారత్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.అయితే, ఈ మ్యాచ్‌ లో, టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తన సొంత జెర్సీకి బదులుగా మహమ్మద్ సిరాజ్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. నెదర్లండ్స్ బౌలర్ ఆర్యన్ దత్ వేసిన తొలి ఓవర్‌లో మూడు బంతులు ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Read Also: T20 World Cup 2026: నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం

ind-vs-ned-abhishek-wears-siraj-jersey-reason
ind-vs-ned-abhishek-wears-siraj-jersey-reason

ఈ టోర్నీలో అభిషేక్ శర్మకు వరుసగా ఇది మూడో డకౌట్‌. ఈ మెగా టోర్నీతోనే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆడటం మొదలుపెట్టిన అభిషేక్ శర్మ మూడు మ్యాచ్‌లు అయినా ఒక్క పరుగు చేయలేకపోయాడు.అభిషేక్ శర్మ.. సిరాజ్ జెర్సీ ధరించి బరిలోకి దిగడంపై భిన్న వాదానాలు వినిపిస్తున్నాయి. అభిషేక్ శర్మ తన జెర్సీని హోటల్ గదిలో మర్చిపోయాడని ఈ మ్యాచ్‌కు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న నాజర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ తమ వ్యాఖ్యానంలో తెలియజేశారు.

అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే

అయితే మైదాన వర్గాల సమాచారం ప్రకారం.. అభిషేక్ శర్మ జెర్సీ తెచ్చుకున్నా.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి తీసుకురాలేకపోయారని, దాంతోనే సిరాజ్ జెర్సీతో బరిలోకి దిగాడని తెలుస్తోంది.కానీ ఫీల్డింగ్ సమయంలోనూ అభిషేక్ శర్మ.. సిరాజ్ జెర్సీలోనే కనిపించాడు. జెర్సీ అందుబాటులో లేకపోవడంతోనే బెంచ్ ప్లేయర్ అయిన సిరాజ్ జెర్సీ నెంబర్ 73 ధరించి అభిషేక్ శర్మ బరిలోకి దిగినట్లు అర్ధమవుతుంది.ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాడు తన సొంత నంబర్ ఉన్న జెర్సీనే ధరించాలి. అయితే, అసాధారణ పరిస్థితుల్లో ఆటగాళ్లు ఇలా వేరే ఆటగాడి జెర్సీని ధరించి బరిలోకి దిగుతుంటారు. గతంలో చాలా మంది ఆటగాళ్లు ఇలా తమ సహచర ఆటగాళ్ల జెర్సీలతో బరిలోకి దిగారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870