हिन्दी | Epaper
ఉచిత మీమాంస తగునా చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక మేయర్ పీఠం సుప్రీంకోర్టు తీర్పు మరణించిన దూడ తెలంగాణకు శుభవార్త ఎన్నిక వాయిదా అప్రజాస్వామికం డ్రగ్స్ ముఠా బట్టబయలు లోన్ యాప్ మోసాలపై జాగ్రత్త..! ఆర్గానిక్ ఫార్మర్స్ యాప్ ఉచిత మీమాంస తగునా చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక మేయర్ పీఠం సుప్రీంకోర్టు తీర్పు మరణించిన దూడ తెలంగాణకు శుభవార్త ఎన్నిక వాయిదా అప్రజాస్వామికం డ్రగ్స్ ముఠా బట్టబయలు లోన్ యాప్ మోసాలపై జాగ్రత్త..! ఆర్గానిక్ ఫార్మర్స్ యాప్ ఉచిత మీమాంస తగునా చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక మేయర్ పీఠం సుప్రీంకోర్టు తీర్పు మరణించిన దూడ తెలంగాణకు శుభవార్త ఎన్నిక వాయిదా అప్రజాస్వామికం డ్రగ్స్ ముఠా బట్టబయలు లోన్ యాప్ మోసాలపై జాగ్రత్త..! ఆర్గానిక్ ఫార్మర్స్ యాప్ ఉచిత మీమాంస తగునా చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక మేయర్ పీఠం సుప్రీంకోర్టు తీర్పు మరణించిన దూడ తెలంగాణకు శుభవార్త ఎన్నిక వాయిదా అప్రజాస్వామికం డ్రగ్స్ ముఠా బట్టబయలు లోన్ యాప్ మోసాలపై జాగ్రత్త..! ఆర్గానిక్ ఫార్మర్స్ యాప్

KTR warning : కేటీఆర్ ఫైర్, కాంగ్రెస్ నేతలకు భారీ హెచ్చరిక!

Sai Kiran
KTR warning : కేటీఆర్ ఫైర్, కాంగ్రెస్ నేతలకు భారీ హెచ్చరిక!

KTR warning : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని అడ్డదారుల్లో కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ అరెస్ట్ జరిగిందని ఆయన విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టడం సిగ్గుచేటని అన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు కాంగ్రెస్ నేతలు చేసిన చర్యలకు వడ్డీతో సహా రాజకీయంగా సమాధానం చెప్పాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.

Read Also: Maharashtra: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీబీఐ విచారణకు సునేత్ర డిమాండ్

KTR warning
KTR warning

క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్‌కు మెజారిటీ ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి మున్సిపాలిటీని చేజిక్కించుకోవడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే సుమన్‌పై కేసులు పెట్టి అరెస్ట్ చేశారని తెలిపారు. ప్రజలు బంద్ పాటించి నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.

కొంతమంది పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన కేటీఆర్, వారు తమ ధోరణి మార్చుకోకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బాల్క సుమన్‌ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870