Ambati Rambabu: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తూ, కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.
తనపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైలులో ఉన్నా, అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదు. జగన్ (YS Jagan) నాయకత్వంలో కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు. నన్ను చంపాలనుకున్నారు. నా భార్యా పిల్లలను వేధించారు. ప్రాణం ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటాను’ అని అన్నారు.
Read Also: PMSuryaGhar: జిల్లాలో ఆరు గ్రామాలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: